Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి 11 నెలలు అవుతున్నా ఇప్పటి వరకు ఏ ఒక్క కొత్త నోటిఫికేషన్ రాలేదు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్ల రిక్రూట్‌మెంట్‌ను మాత్రమే భర్తీ చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. కానీ తానేదో కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి, ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టు రేవంత్ రెడ్డి బిల్డప్ ఇస్తున్నారు. ఇప్పటికే 50 వేల ఉద్యోగాలు భర్తీ చేశానని ఆయా వేదికల మీద తప్పుడు ప్రకటనలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు స్పందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు పరీక్షల్లో ఎంపికై, ఉద్యోగాలు పొంది 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న 8,047 పోలీసు కానిస్టేబుల్లకు హరీశ్‌రావు శుభాకాంక్షలు తెలిపారు. నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తూ, శాంతి భద్రతలు కాపాటంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండానే పది నెలల్లో 50వేల ఉద్యోగాలు భర్తీ చేశామని గోబెల్స్ ప్రచారం మొదలు పెట్టిన రేవంత్ రెడ్డి.. ఇవి కూడా ఆయన ఖాతాలోనే వేసుకుంటారేమో అని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.
బిఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన పోలీసు పరీక్షల్లో ఎంపికై, ఉద్యోగాలు పొంది 9 నెలల శిక్షణ పూర్తి చేసుకొని విధుల్లో చేరబోతున్న 8,047 పోలీసు కానిస్టేబుల్ లకు శుభాకాంక్షలు.
నీతి, నిజాయితీలతో వ్యవహరిస్తూ, శాంతి భద్రతలు కాపాటంలో నిమగ్నం కావాలని, ఉద్యోగ నిర్వహణలో రోల్ మోడల్ గా నిలవాలని… pic.twitter.com/XS44H23E27
— Harish Rao Thanneeru (@BRSHarish) November 21, 2024
ఇవి కూడా చదవండి..
MLC Kavitha | అఖండ భారతంలో అదానికో న్యాయం.. ఆడబిడ్డకో న్యాయమా..? ఎమ్మెల్సీ కవిత ట్వీట్
Stocks | అదానీ గ్రూపుపై అమెరికాలో కేసు.. నష్టాలతో ముగిసిన ఈక్విటీలు..!