Harish Rao | హైదరాబాద్ : గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలలు అస్తవ్యస్తంగా మారాయి. కనీస మౌలిక సదుపాయాలు లేక విద్యార్థులు విలవిలలాడిపోతున్నారు. అంతేకాకుండా భోజనం కూడా సరిగ్గా వండించడం లేదు. వడ్డించిన భోజనం తిని పిల్లలు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ పరిణామాలపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఎక్స్ వేదికగా తీవ్రంగా స్పందించారు.
గురుకులాలా లేక నరక కూపాలా..? అని హరీశ్‌రావు నిప్పులు చెరిగారు. ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్‌తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై కొట్టుమిట్టాడుతున్నదని గుర్తు చేశారు హరీశ్‌రావు.
ఈరోజు నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తాజాగా నారాయణ పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని గురుకులల్లో, ప్రభుత్వ పాఠశాలల్లో అసలేం జరుగుతున్నది. పాఠాలు నేర్చుకోవడం కాదు ప్రాణాలతో బయటపడితే చాలు అనే పరిస్థితిని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ఇందుకేనా మీరు విజయోత్సవాలు జరుపుతున్నది.? మీ నిర్లక్ష్య పూరిత వైఖరికి ఇంకెంతమంది విద్యార్థులు బలి కావాలి..? ఆస్పత్రి పాలైన విద్యార్థులను హైదరాబాద్‌కు తరలించి మెరుగైన వైద్యం అందించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
గురుకులాలా లేక నరక కూపాలా?
ప్రభుత్వ పాఠశాలలా లేక ప్రాణాలు తీసే విషవలయాలా?వాంకిడి గిరిజన గురుకులంలో ఫుడ్ పాయిజన్ తో అనారోగ్యం పాలై ఓ విద్యార్థిని 20 రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో వెంటిలేటర్ పై కొట్టుమిట్టాడుతున్నది.
ఈరోజు నల్లగొండ జిల్లాలో పాముకాటుకు గురైన విద్యార్థి ఆసుపత్రిలో… pic.twitter.com/rApQe37zKi
— Harish Rao Thanneeru (@BRSHarish) November 20, 2024
ఇవి కూడా చదవండి..
KTR | స్వరాష్ట్ర సాధనలో కీలక ఘట్టం దీక్షా దివాస్ : కేటీఆర్
BRS Party | బీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్
Narayanapeta | మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యం.. పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్రభుత్వం