నారాయణపేట : కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థుల జీవితాలు గాలిలో దీపాల్లా మారాయి. ప్రభుత్వ అసమర్ధత, అధికారుల నిర్లక్ష్యంతో హాస్టల్స్, పాఠశాల పిల్లలు ప్రాణాలు పోతున్నాయి. పిల్లలు ఫుడ్ పాయిజన్‌తో హాస్పిటల్లో చేరినా అదే నిర్లక్ష్యం పునారావృతమవుతుండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
వివరాల్లోకి వెళ్తే..నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్ ఫుడ్‌పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ హాస్పిటల్‌కు(Mahabubnagar Govt hospital) తరలించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఉదయం విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ఇచ్చిన ఉప్మా టిఫిన్‌లో సైతం పురుగులు(White worms) రావడం కలకలం రేపింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు దవాఖాన సిబ్బందితో గొడవకు దిగారు.
BIG BREAKING NEWS
దారుణం మళ్లీ మళ్లీ అదే నిర్లక్ష్యం.. పిల్లల ప్రాణాలు అంటే లెక్క లేదా
విద్యార్దులకు ఆసుపత్రిలో ఇచ్చిన టిఫిన్‌లో సైతం పురుగులు
నారాయణపేట జిల్లా మాగనూర్ హైస్కూల్ ఫుడ్‌పాయిజన్ ఘటనలోని విద్యార్థులను మహబూబ్ నగర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన విషయం తెలిసిందే..… https://t.co/lMiviUU847 pic.twitter.com/v9tys7NOGA
— Telugu Scribe (@TeluguScribe) November 21, 2024