Mahmood Ali | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో మైనార్టీలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహముద్ అలీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భవన్లో మహముద్ అలీ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి అనేక హామీలు ఇచ్చింది. కానీ ఏ ఒక్క హామీ కూడా పూర్తిగా అమలు కాలేదు. మైనారిటీ డిక్లరేషన్ ప్రకటించి మర్చిపోయారు. మైనార్టీల ఓట్లు వేసుకోని మోసం చేశారు. కేసీఆర్ మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, అమలు చేశారు. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేశారు. కేసీఆర్ మైనారిటీలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తామని ఇవ్వడం లేదు. మైనారిటీ విద్యార్థులకు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరుతో ప్రోత్సాహకాలు ఇస్తామని అమలు చేయడం లేదు. గతంలో కాంగ్రెస్,టీడీపీ రాష్ట్రాన్ని పాలించినా కేసీఆర్ సీఎం అయ్యాక
మైనారిటీలకు మేలు జరిగింది. కేసీఆర్ గంగా, జమునా తెహజీబ్లా పరిపాలన చేశారని మహముద్ అలీ గుర్తు చేశారు.
కేసీఆర్ మైనారిటీలకు సబ్సిడీ ఇచ్చారు. రేవంత్ రెడ్డి వచ్చాక ఒక్క రూపాయి మైనారిటీలకు సబ్సిడీ ఇవ్వలేదు. ఉర్దూ డీఎస్సీ
నిర్వహించడం లేదు. కేసీఆర్ ఉర్దూను తెలంగాణ రెండవ అధికార భాషగా ప్రకటించారు. సెట్విన్ ద్వారా ముస్లింలకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చేవారు. కేసీఆర్ హయాంలో పాతబస్తీ అభివృద్ధి జరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ముస్లిం, మైనారిటీలపై దాడులు పెరిగాయి. రేవంత్ రెడ్డి పాలనలో రైతులు, ప్రజలు పరేషాన్లో ఉన్నారు. కేసీఆర్ సెక్యూలర్ లీడర్. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీనా లేదా అనేది రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ చెప్పాలి. రేవంత్ రెడ్డి పాలనలాగా లేదు మోదీ పాలనలా ఉంది. రేవంత్ రెడ్డి మోదీని బడే భాయ్ అన్నారు. రేవంత్ రెడ్డి మోడీ,అమిత్ షా ను ఫాలో అవుతున్నారు అని ఎమ్మెల్సీ మహముద్ అలీ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Caste census | తెలంగాణలో బీసీ జనాభా 46.25 శాతం.. 4న క్యాబినెట్ ముందుకు కులగణన నివేదిక
Harish Rao | భేషజాలకు పోకుండా హైడ్రా దుకాణం బంద్ చేయండి : హరీశ్‌రావు
Harish Rao | బిల్డర్ వేణుగోపాల్ రెడ్డి ఆత్మహత్య కాంగ్రెస్ ప్రభుత్వం హత్యే : హరీశ్‌రావు