MLC Kavitha | హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది అన్నదాతలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జాతీయ రైతు దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అన్నదాతలపై కవిత ప్రశంసలు కురిపిస్తూ.. ఈ దేశానికి వెన్నెముక రైతన్న అని కొనియాడారు.
మానవాళికి నిత్యావసరమైన ఆహారాన్ని పండించేందుకు, పంట పొలాల్లో ఎండనక, వాననక రైతన్నలు పడే కష్టం వెలకట్టలేనిది అని కవిత పేర్కొన్నారు. రైతే రాజు అన్న నినాదాన్ని నిజం చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం గత పదేండ్లలో రైతు బంధు, 24 గంటల ఉచిత కరెంటు, రైతు భీమా వంటి అనేక విప్లవాత్మక పథకాలు అమలు చేసి, ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టింది అని ఆమె పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో కేసీఆర్ గారి పరిపాలన దేశానికే ఆదర్శంగా నిలిచింది అని కవిత ప్రశంసించారు. జై కిసాన్.. జై తెలంగాణ!! అని కవిత నినదించారు.
ఇవి కూడా చదవండి..
KTR | తెలంగాణ కొంగు బంగారం మన సింగరేణి..! కార్మికులకు కేటీఆర్ శుభాకాంక్షలు
Nallagonda | పోలీసులు కేసు నమోదు చేయట్లేదని.. సెల్ టవరెక్కి ఆటో డ్రైవర్ హల్చల్
Harish Rao | అడిగినవాళ్లను అదరగొడుతుండు.. ప్రశ్నిస్తే పగబడుతుండు.. రేవంత్‌పై హరీశ్ ఫైర్