Sabitha Indra Reddy | హైదరాబాద్ : సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. ఎమ్మెల్యే సునీత ఇంటిపై దాడి చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని డీజీపీ జితేందర్‌ను సబితా ఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
మెదక్ జిల్లాలోని నర్సాపూర్ నియోజకవర్గం పరిధిలోని గోమారంలోని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి నివాసంపై ఆదివారం రాత్రి కాంగ్రెస్ గూండాలు దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై దాడి ఘటనలో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మణిదీపక్ ఫిర్యాదుతో కాంగ్రెస్ కార్యకర్తలు రమేశ్, నరసింహా, భాస్కర్, సుధాకర్‌పై కేసు నమోదైనట్లు వివరించారు.
సీనియర్ శాసనసభ్యురాలు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి @sunitavakiti గారి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, రాష్ట్ర డిజిపి @TelanganaDGP గారు వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను.
— Sabitha Reddy (@BrsSabithaIndra) September 23, 2024
ఇవి కూడా చదవండి..
Harish Rao | రాష్ట్రంలో ప్రజా పాలన కాదు.. గూండా రాజ్యం నడుస్తుంది : హరీశ్‌రావు
KTR | దాడులతో సునీతా లక్ష్మారెడ్డి మనో ధైర్యాన్ని దెబ్బతీయలేరు : కేటీఆర్
Bathukamma | పువ్వులనే దైవాలుగా పూజించే పండుగ.. మన బతుకమ్మ పండుగ.. ఇవీ విశేషాలు..!