MLA Prashanth Reddy | హైదరాబాద్ : ట్విట్టర్‌కు టిక్‌టాక్‌కు తేడా తెలియని వాడు, పాలించడం చేతగాక ఫాల్తూ మాటలు, పాగల్ మాటలు మాట్లాడుతూ, అచ్చోసిన ఆంబోతులా ఊరేగేవాడు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజల దురదృష్టం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మండిపడ్డారు. ఇవాళ తెలంగాణ భవన్లో ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఆఫిషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్టు పెట్టి తెలంగాణ ప్రజల చేత తన్నించుకున్న వ్యక్తి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ సర్వేలో కేసీఆర్‌కు 70 శాతం, నీకు 30 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో రేవంత్ రెడ్డి మైండ్ బ్లాక్ అయింది. నిన్న షాద్‌నగర్ మీటింగ్‌లో ఫ్రస్టేషన్‌తో ఊగి పోతూ ఎప్పటిలాగే ఆ కంపునోరుతో అవే అబద్దాలు, అవే సంస్కారం లేని మాటలు, అదే బూతులు మాట్లాడిండు. అందుకే ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి అని పిలవకుండా బూతుల రేవంత్ రెడ్డి అంటున్నారని వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
నేను మాట తప్పే, మడమ తిప్పే రకం కాదు అన్నవు రేవంత్ రెడ్డి.. మరి రుణమాఫీ డిసెంబర్ 9 నాడే చేస్తా అన్నదేవడు..? తర్వాత తెలంగాణలో ఉన్న దేవుళ్ళందరి మీద ఒట్టు పెట్టి ఆగస్టు 15 లోపు చేస్తా అన్నదేవడు..? తర్వాత మళ్లీ దసరా లోపు అన్నదేవడు..? రేవంత్ రెడ్డి పూర్తి అయ్యిందా? రుణమాఫీ నేటికి 4 విడుతలుగా వేసినా కూడా మీ లెక్కల ప్రకారం ఇంకా 20 లక్షల మందికి రుణమాఫీ కాలేదు. మా లెక్కల ప్రకారం ఇంకా 30 లక్షల మందికి కాలేదు. ఇది మాట తప్పుడు కాదా..? అని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. అందుకే నిన్ను ప్రజలు ఏనుముల రేవంత్ రెడ్డి కాదు కోతల రేవంత్ రెడ్డి అంటున్నారని ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
నీ నోటితోనే అన్నావు కేసీఆర్ రెండు పర్యాయాలు కలిపి రూ. 29000 కోట్ల రుణమాఫీ చేసిండు అని. మీరే ఒప్పుకున్నారు మేము రూ. 21000 కోట్లు చేసినం అని. మీకంటే కేసీఆర్ రూ. 8000 కోట్లు ఎక్కువ చేసినట్టే కదా! మరి నిన్నేం మాట్లాడినావు..? అది నోరా..? మోరా..? రేవంత్ రెడ్డి. రైతుబంధు కింద రూ. 10,000 ఇచ్చి చేతులు దులుపుకున్నదేవడు..?
తర్వాత వానాకాలం పంటకు ఎగ్గొట్టి, తర్వాత యాసంగి పంటకు సంక్రాంతికి ఇస్తానన్నదేవడు..? ఇచ్చినావ రేవంత్ రెడ్డి..? తర్వాత మాట మార్చి జనవరి 26న టిక్.. టిక్ అన్నదేవడు? వినిపించిందా టిక్ టిక్? ఇప్పుడు మళ్లీ 31 అంటున్నదేవడు..?
ఇది మాట తప్పుడు కాదా..? ప్రజా పాలన అని ప్రతిరోజు ప్రజలను స్వయంగా కలుస్తా అన్నదేవడు..? కలుస్తున్నవా..? ఈ 14 నెలలల్లో ఒకే ఒక్క రోజు ఒక గంట కలిస్తివి. ఇది మాట తప్పడం కాదా..? అని రేవంత్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి నిలదీశారు.
అన్ని శాఖలు ఒకే దగ్గర ఉండేటట్టు సువిశాలమైన అంబేద్కర్ సచివాలయం కేసీఆర్ కడితే దాన్ని కాదని నీ జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుండి లేకపోతే పోలీసుల అధీనంలో ఉండే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి పాలన సాగిస్తూ.. మంత్రులను, అధికారులను నీ చుట్టూ తిప్పుకుంటున్న అహంకారివి నువ్వు కాదా..? రైతు బాంధవుడైన కేసీఆర్ గురించి మాట్లాడే నైతిక హక్కు నీకు ఏమాత్రం లేదు. కేసీఆర్ కాలిగోటికి కూడా నువ్వు సరిపోవు. కేసీఆర్ కొడితే దెబ్బ ఎట్లుంటదో నీకు తెలవదా రేవంత్ రెడ్డి. నీ కొడంగల్ గడ్డమీదకి వచ్చి నిన్ను మట్టిగరిపించినం. అక్కడ కొట్టిన దెబ్బకు వచ్చి మల్కాజిగిరిలో పడ్డవు. యావత్ తెలంగాణ ప్రజలు నిన్ను ఓటుతో మళ్లీ కొడుతరు. నిన్ను నీ కాంగ్రెస్ పార్టీని గంగలో పడేస్తరు. ఇప్పటికైనా కేసీఆర్ మీద నోరు పారేసుకోవడం మానేసి పాలనపై దృష్టి సారించు అని రేవంత్ రెడ్డిని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Economic Survey | కేసీఆర్ సేవ అద్భుతం.. బీఆర్ఎస్ పాలనకు ఎకనామిక్ సర్వే కితాబు