Budget 2025 Memes | 2025-26 ఆర్థిక సంవత్సరానికి చెందిన బడ్జెట్‌ను (Union Budget 2025)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టగా.. కేంద్రంలో ప్రధాన మిత్రపక్ష రాష్ట్రమైన బీహార్‌కు ఈ బడ్జెట్లో వరాల జల్లు కురిపించారని తెలిసిందే. దేశమంతా ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చంతా బడ్జెట్ చుట్టూ నడుస్తుందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. కాగా సోషల్ మీడియాలో తరచూ ట్రెండింగ్ టాపిక్‌గా నిలిచే వాటిపై ట్రోల్స్, మీమ్స్ రావడం కొత్తేమీ కాదు.
ఇవాళ కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై కూడా ఫన్నీ మీమ్స్ నెట్టింట దర్శనమిచ్చాయి. నెటిజన్లు తాజా బడ్జెట్‌ను పాపులర్ సినిమాలోని పాత్రలతో లింక్ చేస్తూ మీమ్స్ చేస్తున్నారు. బడ్జెట్లో పదే పదే బీహార్ పేరు తెరపైకి రావడంతో.. యానిమల్, బ్రహ్మాస్త్ర సినిమాలతో మీమ్స్ చేశారు. యానిమల్‌లో రణ్‌బీర్‌కపూర్ నాన్న పేరును 196 సార్లు పలికితే.. బ్రహ్మాస్త్రలో అలియా భట్ 83 సార్లు శివ పేరును, పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ బీహార్ పేరును 537 సార్లు పలికారంటూ మీమ్స్ క్రియేట్ చేశారు.
Most repeated words. #Budget2025 pic.twitter.com/4pjtahNdks
— Sagar (@sagarcasm) February 1, 2025
అంతేకాదు 2025 బడ్జెట్ తర్వాత బీహార్ ఇలా ఉండబోతుంది.. అంటూ శివాజీలో రజినీకాంత్ నడుచుకుంటూ వస్తుంటే క్షణాల్లో రోడ్లు, బిల్డింగ్స్‌తోపాటు జెట్ స్పీడ్‌లో అభివృద్ధి జరిగినట్టుగా నెట్టింట ఇప్పటికే వైరల్ అవుతోన్న ఓ వీడియోను ట్యాగ్ చేశారు. ఇప్పుడీ మీమ్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి.
Bihar after Union Budget 2025: pic.twitter.com/amld28Te51
— Xavier Uncle (@xavierunclelite) February 1, 2025
వేతన జీవులకు భారీ ఊరట కలిగిస్తూ 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపునిచ్చారని తెలిసిందే. దీనినుద్దేశించి.. బడ్జెట్‌కు ముందు జీతం ఎంత తీసుకుంటారు.. మాట్లాడుదాం.. అంటే బడ్జెట్ తర్వాత రూ.12 లక్షల కంటే తక్కువ జీతం కావాలి సార్ అంటూ క్రియేట్ చేసిన మీమ్ ఫన్నీగా నెటిజన్ల అటెన్షన్‌ను తనవైపునకు తిప్పుకుంటోంది.
Me giving interview after budget 2025#NirmalaSitharaman #IncomeTax #BudgetSession2025 pic.twitter.com/lFgR62Qry4
— Hum Binod (@BinodnotVinod) February 1, 2025
Union Budget 2025 | గంటా 15 నిమిషాల పాటు కొనసాగిన నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగం