Harish Rao | హైదరాబాద్ : గిరిజనుల ఆరాధ్య దైవం కుమ్రం భీం జయంతి సందర్భంగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) ఘనంగా నివాళులర్పించారు. అడవి బిడ్డల ఘీంకార స్వరం ఆయన అని పేర్కొన్నారు. ఆదివాసుల స్వయం ప్రతిపత్తే ధ్యేయంగా ఎగిసిన ఉద్యమబావుట.. దేశానికి స్వాతంత్రం రాకముందే ‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరు తలపెట్టిన పోరాట యోధుడు కుమ్రం భీం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
తమ భూముల్లోంచి నిర్ధాక్షిణ్యంగా గెంటేయడంతో కుమ్రం భీం ఆధ్వర్యంలో 1940 ‘జోడేఘాట్(బాబేఝరి) సాయుధ తిరుగుబాటు మొదలైందని, ఆదివాసీల స్వయం పాలన కోసం ఆయన చేసిన జోడేఘాట్ తిరుగుబాటు మహోజ్వల చరిత్రగా నిలిచిందన్నారు. ఆయన పోరాట స్ఫూర్తి ఆదర్శమని, కుమ్రం భీం ఆశయ అడుగు జాడల్లో పయనిద్దామన్నారు. గోండు వీరుడికి జోహార్లు అంటూ ట్వీట్ చేశారు.
అడవి బిడ్డల ఘీంకారం స్వరం..
ఆదివాసుల స్వయం ప్రతిపత్తే
ధ్యేయంగా ఎగిసిన ఉద్యమ భావుట..
దేశానికి స్వాతంత్రం రాకముందే
‘జల్ జంగల్ జమీన్’ నినాదంతో పోరు తలపెట్టిన పోరాట యోధుడు కొమురం భీం జయంతి సందర్భంగా ఘన నివాళులు. pic.twitter.com/33P2S4QnqS— Harish Rao Thanneeru (@BRSHarish) October 22, 2024
ఇవి కూడా చదవండి..
KTR | అందిన కాడికి దోచుకో.. బామ్మర్ది, తమ్ముళ్ల తోటలో దాచుకో.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
KTR | నిరాధార ఆరోపణలు, వ్యక్తిగత దాడులపై పోరాటం చేస్తా : కేటీఆర్
KTR | ఆర్థిక నిర్వహణ సూచికలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానం.. ఇదిగో సాక్ష్యం : కేటీఆర్