Kaushik Reddy | హైదరాబాద్ : ఐదేండ్ల తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు. ఇప్పుడు పార్టీ మారిన నేతల సంగతి అప్పుడు చూస్తాం అని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఐదేండ్ల తర్వాత కేసీఆర్ సీఎం కావడం ఖాయం.. మీ భరతం పట్టడం ఖాయం. ఇది రాసిపెట్టుకోండి. ఇప్పుడు పార్టీ మారిన వారందరికీ నాలుగేండ్ల తర్వాత సినిమా చూపిస్తాం. ప్రతిపక్షానికి పీఏసీ ఇవ్వడం ఆనవాయితీ.. మేం అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షానికి ఇచ్చాం. ఇప్పుడు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, గంగుల కమలాకర్ దాఖలు చేసిన నామినేషన్లు ఏమయ్యాయి. నామినేషన్ దాఖలు చేయని అరికెపూడి గాంధీకి దొంగచాటున పీఏసీ ఎలా ఇస్తారని కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు.
అరికెపూడి గాంధీ మాట్లాడిన మాటలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నా. మైనంపల్లి హన్మంత్ రావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారు. 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. రేపు నీ నియోజకవర్గంలో నీకు కూడా అదే గతి పడుతుంది. ఉప ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో చూపిస్తాం. ఏదో తిట్టి డైవర్షన్ చేయడం కాదు.. సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
Padi Kaushik Reddy | చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే రేవంత్ రెడ్డి : ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి