Kaushik Reddy | హైదరాబాద్ : తన్నుకోవడం, గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదు.. నీవు మొగోడివైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్ అని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. తన నివాసంలో పాడి కౌశిక్ రెడ్డి గురువారం ఉదయం మీడియాతో మాట్లాడారు.
పూటకో పార్టీ మారే బ్రోకర్ గాంధీ. పోలీసు కంచెలు వేసి మీరు నన్ను ఆపారు.. పర్వాలేదు. గాంధీ వాడే భాషను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. నేను ప్యూర్ తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డను. ఎక్కడ్నుంచో వచ్చి మా గడ్డ కూర్చొని సవాల్ విసిరితే ఇక్కడ ఎవరూ భయపడరు. కేటీఆర్, హరీశ్‌రావుతో మాట్లాడి అనుమతి తీసుకున్నా.. శుక్రవారం ఉదయం 11 గంటలకు మేడ్చల్ జిల్లాలోని బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు అక్కడ్నుంచి శంభీపూర్ రాజు నాయకత్వంలో వేలాది మంది కార్యకర్తలతో గాంధీ ఇంటికి వెళ్తాం. అక్కడే బ్రేక్ ఫాస్ట్, లంచ్ చేద్దాం. గాంధీ బీఆర్ఎస్ కండువా కప్పుకున్న తర్వాత తెలంగాణ భవన్‌కు చేరుకుని ప్రెస్‌మీట్ పెడుదాం. అక్కడ్నుంచి గాంధీని కేసీఆర్ వద్దకు తీసుకెళ్లి ఘనస్వాగతం పలుకుదాం.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మీద అభిమానం ఉన్న ప్రతి కార్యకర్త తరలిరావాలని పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీతో గాంధీకి పంచాయితీ లేదట.. కేవలం కౌశిక్ రెడ్డితోనే అంటడు. నీకు నాకు ఏమైనా భూ తగాదాలు ఉన్నాయా..? అన్నదమ్ముళ్ల పంచాయితీలు ఉన్నాయా..? నేను అడిగింది ఒక్కటి ఆయన చెప్పేది మరొక్కటి. ఆయన భాషను అందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ బీ ఫాం మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరడం సిగ్గు అనిపిస్త లేదా..? కష్టకాలంలో పార్టీని ఎలా వదిలిపెట్టవు. వందలాది కోట్లకు అమ్ముడు పోయావు. భూములు సెటిల్ చేసుకోవడానికి స్వార్థం కోసం వెళ్లావు. కేసీఆర్ నీకు ఏం తక్కువ చేయలేదు. నీ నియోజకవర్గాన్ని కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారని కౌశిక్ రెడ్డి గుర్తు చేశారు.
ప్రజాస్వామ్యంలో తన్నుకోవడం.. గుద్దుకోవడం పెద్ద ఇష్యూ కాదు.. నిజంగా తన్నుకుందాం అనుకుంటే ఒక్కడివి రా..? నేను కూడా ఒక్కడిని వస్తా.. తన్నుకుందాం.. ఎవరు ఎక్కువ బలవంతులో చూసుకుందాం.. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రజాస్వామ్యంలో అది ఒప్పుకోరు కదా..? నీకు దమ్ముంటే, నీవు మొగోడివైతే, చీము నెత్తురు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, ఉప ఎన్నికకు రా.. గెలిచి చూపించు. నీవు దమ్మున్నోడివి అని ఒప్పుకుంటా.. దమ్ముంటే పదవికి రాజీనామా చేయ్.. ఎన్నికల్లో చూసదుకుందాం. కేసీఆర్ నాయకత్వంలో మా దమ్మేందో చూపిస్తాం. ఏదో తిట్టి డైవర్షన్ చేయడం కాదు.. సూటిగా అడుగుతున్నా సమాధానం చెప్పాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి..
RSP | ఆకాశానికి ఎగిసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ధ్వజం
KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్