KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్
KTR | అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రుణమాఫీ కాలేదని కొందరు.. రైతు భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారినా.. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | హైదరాబాద్ : అధికార కాంగ్రెస్ పార్టీ వ్యవసాయ రంగాన్ని తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రుణమాఫీ కాలేదని కొందరు.. రైతు భరోసా అందక ఇంకొందరు అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటున్నారు. అన్నదాతల పరిస్థితి ఆందోళనకరంగా మారినా.. కాంగ్రెస్ సర్కార్ మొద్దు నిద్ర వీడటం లేదంటూ బీఆర్ఎస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ రైతును రాజు చేస్తే.. ఈ కాంగ్రెస్ సర్కార్ అన్నదాతల ప్రాణాలను తీస్తుందంటూ ధ్వజమెత్తారు. రైతు రుణమాఫీ బోగస్.. రైతు భరోసా కూడా బోగస్ అంటూ కేటీఆర్ నిప్పులు చెరిగారు.
నిన్న సురేందర్ రెడ్డి.. నేడు సాగర్ రెడ్డి..
అటు బ్యాంకులు, ఇటు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా రుణమాఫీ కాకపోవడంతో మేడ్చల్లో వ్యవసాయ కార్యాలయం సాక్షిగా రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి, తనకు ఉన్న రుణం మాఫీ కాకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన దగాకు బలైపోయాడని కేటీఆర్ తెలిపారు. భార్యాభర్తలిద్దరిలో ఒక్కరి కూడా రుణమాఫీ కాలేదన్న ఆవేదనతో జగిత్యాలలో పురుగుల మందు తాగి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు రైతు సాగర్ రెడ్డి. తన పేరిట ఉన్న లక్షన్నర రుణం, తన భార్య పేరిట ఉన్న లక్షా 60 వేల రుణంలో ఏ ఒక్కరి రుణం మాఫీ అయినా గట్టెక్కుతానని గంపెడాశలు పెట్టుకుని దారుణంగా మోసపోయాడని కేటీఆర్ పేర్కొన్నారు.
మాట తప్పిన సీఎంను ఏం చేయాలి..?
ముఖ్యమంత్రి చేసిన తీరని ద్రోహానికి ఇంకా ఎంతమంది రైతులు ప్రాణాలను బలిపెట్టాలి..? ఏకకాలంలో అందరికీ రూ. 2 లక్షల రుణమాఫీ అని ఇచ్చిన మాటతప్పిన సీఎంను ఏం చేయాలి..? డిసెంబర్లో పెట్టిన డెడ్ లైన్ సెప్టెంబర్ దాటినా అమలుకాకపోతే దగాపడ్డ అన్నదాతలు ఇంకా ఎవరికి చెప్పుకోవాలి..? రూ. 49,500 వేల కోట్ల రుణమాఫీలో పావుశాతం కూడా చేయకుండా చేతులెత్తేసినందుకు రైతన్నలకు క్షమాపణలు చెప్పాలి రేవంత్ సర్కార్. ఇంకెంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే మీ కళ్ళు చల్లారుతాయి? రేవంత్ రెడ్డి ఢిల్లీ యాత్రలు చేయటం కాదు రాష్ట్రం లో ఏం జరుగుతుందో చూడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దు.. దైర్యంగా ఉండాలని కోరుతున్నాను అని కేటీఆర్ తెలిపారు.
రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా సర్కారు మొద్దు నిద్ర వీడటం లేదు. రుణమాఫీ కాలేదని కొందరు-పెట్టుబడి సాయం రైతు భరోసా లేక కొందరు ప్రాణాలు వదులుకోవడం ఆందోళనకరం
కేసీఆర్ గారు రైతును రాజును చేస్తే ఈ కాంగ్రెస్ సర్కార్ ప్రాణాలు తీస్తుంది.
రైతు రుణమాఫీ అంత బోగస్, రైతు భరోసా… pic.twitter.com/wl1XpHtWFi— KTR (@KTRBRS) September 12, 2024
ఇవి కూడా చదవండి..
Shashank Manu | 2 గంటల్లో 57 స్టేషన్లు చుట్టేశాడు.. మెట్రోలో ప్రయాణంతో గిన్నిస్ రికార్డు
Padi Kaushik Reddy | ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం..?
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | భారత్-వెస్టిండీస్ ఐదో టీ20 వర్షార్పణమేనా..?
AI | ఏఐపై అతిగా ఆధార పడుతున్న యువత.. మానసిక ఆరోగ్యం దెబ్బ తింటుందని నిపుణుల హెచ్చరిక..
Help Desk | పట్టభద్రుల ఎన్రోల్మెంట్ హెల్ప్డెస్క్ ప్రారంభం
‘ఉపాధి కోసం వ్యక్తిగత రుణాలను సద్వినియోగం చేసుకోవాలి’
Bronze Medal | రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో శ్రీవల్లికి కాంస్య పతకం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

