Padi Kaushik Reddy | హైదరాబాద్ : ఈ రాష్ట్రంలో చీరలు, గాజుల సంస్కారం నేర్పించిందే సీఎం రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలిపారు. ఆయన నేర్పించిన సంస్కారాన్నే తాము ఫాలో అవుతున్నామని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అరికెపూడి గాంధీకి చీరలు, గాజులు పంపిస్తానని మాట్లాడడం సరికాదని కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని కౌశిక్ రెడ్డిని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. మీడియా ప్రతినిధి ప్రశ్నకు కౌశిక్ రెడ్డి ఇలా బదులిచ్చారు.
చీరలు, గాజుల సంస్కారాన్ని రేవంత్ రెడ్డే నేర్పించారు. చీర కట్టుకుని గాజులు వేసుకుని బస్సెక్కమని మా పార్టీ నేతలను అవమానించేలా మాట్లాడారు. ఈ రాష్ట్ర సీఎం మాట్లాడినప్పుడు కరెక్టే అనిపించింది. అందుకే రేవంతేనే ఫాలో అవుతున్నాం. ఇక నేను బీఆర్ఎస్ పార్టీలో చేరినప్పుడు.. కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఐదుగురు ఎమ్మెల్యేలే.. నేను పది మందిని ఎలా తీసుకువస్తాను..? ఐదుగురు ఉంటే.. పది మంది ఎమ్మెల్యేలను ఎలా తీసుకువస్తానో గాంధీనే అడగాలని కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి పీసీసీ ఎలా అయిండో అడుగు..? ఆయన పీసీసీ కావడానికి నేనేం సహాయం చేశానో రేవంత్‌నే అడుగు గాంధీ. నేను కాంగ్రెస్ పార్టీకి మోసం చేయలేదు. ఆనాడు రేవంత్ రెడ్డి ఈటల రాజేందర్‌కు రూ. 25 కోట్లకు అమ్ముడుపోయారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఏబీఎన్‌లో ఇంటర్వ్యూ ఇచ్చి బీజేపీ అభ్యర్థి రాజేందర్ గెలుస్తాడని రేవంత్ రెడ్డి చెప్పిండు. రేవంత్ అమ్ముడుపోయిండు తప్పితే నేను అమ్ముడు పోలేదు. కష్టకాలంలో బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉన్న కౌశిక్ రెడ్డి గొప్పోడా.. పార్టీలు మారిన గాంధీ గొప్పోడా.. బ్రోకర్ ఎవరనేది ప్రజలు నిర్ణయించుకుంటారు అని కౌశిక్ రెడ్డి తెలిపారు.
మీరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే తెలంగాణ భవన్‌కు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి కేసీఆర్ వద్దకు పోదాం. లేదు కాంగ్రెస్‌లోకి పోయినవ్ అనుకుంటే రాజీనామా చేయ్.. ఇవాళ నన్ను ఆపావు.. మీడియా వారిని కూడా అనుమతించలేదు. గాంధీ ఇంటికి గొడవకు పోవట్లేదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అంటున్నరు కాబట్టి.. కండువా కప్పేందుకు వెళ్తున్నాం. స్వాగతం పలికి తీసుకువస్తాం. నీవు మాట్లాడిన మాటలకు నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మైనంపల్లి హన్మంత్ రావు అల్వాల్‌లో మీటింగ్ పెట్టి ఇదే విధంగా కేటీఆర్‌ను దూషించారు. 50 వేల ఓట్ల మెజార్టీతో ఓడిపోయారు. నీకు కూడా అదే గతి పడుతుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
RSP | ఆకాశానికి ఎగిసిన గురుకులాలను అధోపాతాళానికి తొక్కుతున్నారు.. రేవంత్ సర్కార్‌పై ఆర్ఎస్పీ ధ్వజం
KTR | కేసీఆర్ రైతును రాజు చేస్తే.. రేవంత్ రైతు ప్రాణాలను తీస్తున్నాడు : కేటీఆర్