ములుగు : జిల్లాలోని వెంకటాపురం మండలం తెలంగాణ , చత్తీస్ఘడ్ సరిహద్దులోని పామునూరు సమీపంలోని కర్రెగుట్టలో జవానులు సెర్చ్ అపరేషన్ చేస్తుండగా ఐఈడీ బాంబు పేలి ( Bomb Explosion ) జవానుకు గాయాలయ్యాయి ( Soldier injure ) . సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.
కర్రెగుట్టల్లోని పామునూరు, జెల్లా గ్రామాల సమీపంలో 39 బెటాలియన్ సీఆర్పీఎఫ్ బృందాలు శుక్రవారం సెర్చు అపరేషన్ నిర్వహించాయి. ప్రమాదవశాత్తు ఐఈడీ బాంబు పేలి నవజీత్ అనే జవాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం ఉదయం నుంచి పోలీసు బృందాలు పామూనూరు నుంచి జెల్లా గ్రామానికి రోడ్డు వేసే క్రమంలో 11 ఐఈడీ బాంబులను గుర్తించి నిర్విర్యం చేశారు.
12 వ బాంబును గుర్తించి నిర్వర్యం చేసే క్రమంలో పేలి ఈ ప్రమాదం జరిగింది. జవాన్ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో అతడిని హుటాహుటినా వెంకటాపురం తరలించి హెలికాప్టర్లో మెరుగైన వైద్య కోసం హైదరాబాద్‌కు తరలించారు.