Padi Kaushik Reddy | హైదరాబాద్ : కరీంనగర్ జిల్లా రివ్యూ మీటింగ్లో కరీంనగర్ ఆర్డీవో విధులకు ఆటంకం కలిగించినట్లు నిరూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరి తీయండి.. చావడానికి రెడీగా ఉన్నానని ఆయన తేల్చిచెప్పారు. తెలంగాణ భవన్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్ కాదు.. చుమ్మా మినిస్టర్వి. అసలు నీకు దమాక్ ఉందా..? కోర్టుకు పోగానే జడ్జి బెయిల్ ఇచ్చి బయటకు పంపిండు. బేకర్ కేసులు అని తిట్టిండు. నన్ను కలెక్టర్ పిలిస్తే పోయాను. కరీంనగర్ ఆర్డీవోతో నా మీద పిటిషన్ వేయించారు. ఆర్డీవో ఎట్ల ఉంటడో కూడా తెలియదు. నా జీవితంలో ఆయనతో మాట్లాడలేదు. ఆయన డ్యూటీకి ఆటంకం కలిగించినట్లు ఫిర్యాదు చేశారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా.. ఆర్డీవోను డిస్టర్బ్ చేయించినట్టు ఒక్క వీడియో క్లిప్ చూపిస్తే.. నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. నేను ఏ ఒక్క తప్పు చేసినా నన్ను ఉరి తీయండి.. చావడానికి రెడీగా ఉన్నా.. తెలంగాణ ప్రజలు, రైతుల కోసం. కానీ అన్యాయంగా కేసులు పెట్టి.. లోపల నూకి ఇబ్బంది పెడుదామనుకుంటే, భయపడి కౌశిక్ రెడ్డి మాట్లాడడు అనుకుంటే.. మిస్టర్ రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో.. దిస్ ఈజ్ కౌశిక్ రెడ్డి.. అందరి కంటే మంచిగా నీకు తెలుసు నా సంగతి. నువ్వు ఎంత ఎక్కువ చేస్తే.. నేను ఇంకా ఎక్కువ చేస్తా.. భయపడే ప్రసక్తే లేదు. ఇది కేసీఆర్ ట్రైనింగ్ ఇచ్చినా బిడ్డరా కౌశిక్ రెడ్డి అంటే.. రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకో. మాది భయపడే రక్తం కాదు.. ప్రశ్నిస్తూనే ఉంటాం.. ఆరు గ్యారెంటీలు అమలు చేసే దాకా నిన్ను అడుగుతనే ఉంటాం.. కడుగుతునే ఉంటాం.. నిన్ను వదిలిపెట్టం అని రేవంత్ రెడ్డిని పాడి కౌశిక్ రెడ్డి హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | రేపు ఈడీ విచారణకు కేటీఆర్
TOMCOM | సౌదీలో నర్సు ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానం
TG Highcourt | తెలంగాణ హైకోర్టుకు నలుగురు కొత్త జడ్జిలు..!