KTR | హైదరాబాద్ : ఏసీబీ అధికారులు లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని హైకోర్టును ఆశ్రయిస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. రేపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టును కోరుతానని పేర్కొన్నారు. నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
మీరు దొంగలు.. మా పట్నం నరేందర్ రెడ్డి ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్లు బుకాయించారు.. మిమ్మల్ని నమ్మను అని లాయర్‌ను తీసుకెళ్తాను అని చెప్పాను. కానీ ఏసీబీ విచారణకు తనతో పాటు లాయర్‌ను అనుమతించలేదు. రేపు కోర్టుకు వెళ్తాను.. లాయర్ల సమక్షంలో విచారణ జరపాలని కోరుతున్నాను. నాకు ఈ దుర్మార్గుల నుంచి చట్టపరమైన రక్షణ కల్పించాలని కోర్టును ప్రాధేయపడుతాను అని కేటీఆర్ పేర్కొన్నారు.
కొంతమంది మంత్రులు వారే న్యాయమూర్తులు అయిపోతున్నారు.. వాళ్లే శిక్షలు వేస్తున్నారు. ట్రయల్ మీడియాలో, సచివాలయంలో, మంత్రుల పేషీల్లో జరగదు. కోర్టుల్లోనే జరుగుతది. మేం కోర్టుకు పోతే మీకు ఉలికిపాటు ఎందుకు..? ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో అరపైసా అవినీతి కూడా జరగలేదు. తెలంగాణ కోసం హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయేందుకు విశ్వనగరంగా ప్రతిష్టించేందుకు ఆశించి ఈ పని చేశాం. మీలాగా ఏదో ఆశించి గూడుపుఠాణి కోసం చేయలేదు అని కేటీఆర్ తెలిపారు.
ఈవీలకు తెలంగాణను కేంద్రం చేయాలనే ఆలోచన చేశాం. మీలాగా దివాళకోరు పని చేయాల్సిన ఖర్మ లేదు. 110 శాతం చెబుతున్నా ఏ విచారణకైనా వస్తా.. కోర్టు మన్నిస్తే లయార్లతో వస్తా.. ఈడీ కూడా పిలిచింది.. వారి దగ్గకు కూడా పోతాను. సమాధానం చెప్పేందుకు రెడీగా ఉన్నాను. దాపరికం లేదు.. దాచాల్సింది ఏం లేదు. నిజాయితీకి ధైర్యం ఎక్కువ.. తప్పకుండా నేను ముమ్మాటికీ తెలంగాణ బిడ్డగా, రోషంగల్లా బిడ్డగా ఏ విచారణనైనా ఎదుర్కొంటాను. ఇది కేవలం ఆరంభం మాత్రమే అని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
KTR | చిట్టి నాయుడిది శునకానందం.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
Sankranthi Holidays | 11 నుంచి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు
Bajireddy Govardhan | పగలు కాంగ్రెస్‌తో.. రాత్రి బీజేపీతో రేవంత్ అనుబంధం : బాజిరెడ్డి గోవర్ధన్