మునుగోడు, ఫిబ్రవరి 21 : 2026-27 విద్యా సంవత్సరానికి గాను పాలిటెక్నిక్ కళాశాలలో అడ్మిషన్లపై లెక్చలర్ల బృందం ఈ నెల 5వ తేదీ నుండి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంది. అందులో భాగంగా శనివారం మునుగోడు మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులకు పాలిటెక్నిక్ కోర్సులపైన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లెక్చరర్ల బృందం మాట్లాడుతూ పాలిటెక్నిక్ విద్య, సాంకేతిక నైపుణ్యాలను, పరిశ్రమల ఆధారిత విద్యను అందిస్తుందని ఇది విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతో ప్రయోజనకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు ఎం.సైదులు, పి.నరసింహ, డాక్టర్ ఎన్.సైదులు, వి.ఆనంద్ కుమార్ పాల్గొన్నారు.