కారేపల్లి, ఫిబ్రవరి 21 : కారేపల్లి మండల కేంద్రంలో సంత్ సేవాలాల్ మహారాజు జయంతి, బోగ్ బండారో వేడుకను శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఐకెపి కార్యాలయం పక్కన ప్రభుత్వం ఆధ్వర్యంలో అధికారికంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్, అదనపు కలెక్టర్ శ్రీజ, లంబాడి ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ రాజ్‌కుమార్ జాదవ్ తో పాటు పలువురు హాజరై బంజారా జాతి అభివృద్ధికి సేవాలాల్ చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులతో పాటు, అన్ని గ్రామ పంచాయతీల సర్పంచులు, పార్టీల నాయకులు పాల్గొన్నారు.

కారేపల్లిలో ఘనంగా సేవాలాల్ జయంతి