KTR | హైదరాబాద్ : హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేయగానే ఏదో జరిగినట్టు కాంగ్రెస్ నేతలు శునకానందం పొందుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. నందినగర్‌లోని తన నివాసంలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
ఒక పాత సామెత చిన్నప్పట్నుంచి వింటున్నా.. ఇప్పుడు అది గుర్తుకు వస్తుంది. పచ్చ కామెర్ల వారికి లోకమంతా పచ్చగా కనబడుతది అంటా.. అవినీతిపరులకు, 50 లక్షలతో దొరికిన దొంగలకు పొలికటిక్ బ్రోకర్లకు ప్రతి కార్యక్రమంలో ఎంతో కొంత చేతులు మారింటదనే ఒక మూర్ఖపు తెలివి, తక్కువ ఆలోచన ఉంటది. అది స్వతహాగానే పుర్రెలో పుట్టింది పోదనన్నట్టు పుట్టుకతో వచ్చిన బుద్ధి అది అని కాంగ్రెస్ సర్కార్‌పై కేటీఆర్ విమర్శలు గుప్పించారు.
పొద్దుట్నుంచి కాంగ్రెస్ నాయకుల హడావుడి చేస్తున్నారు. భారత పౌరుడిగా, రాజ్యాంగాన్ని గౌరవించే పౌరుడిగా ఇది అక్రమ కేసు అని చెబుతున్నాను. పొలిటికల్లి మోటీవేటేడ్ కేసు అందులో ఏమీ లేని లోట్టపీసు కేసు.. బట్టకాల్చి మీద వేసి ఏదో జరిగిందని చూపేట్టే కక్ష సాధింపు కేసులు అని తెలిసీ కూడా ఏసీబీ విచారణకు వెళ్లాను. ఈ కేసు పెట్టి, కథలు అల్లి శునకానందం పొందుతున్న చిట్టి నాయుడికి ఒక మాట చెప్పాల్సి ఉంది. చట్టాన్ని గౌరవించే పౌరుడిగా.. నువ్వు అక్రమ కేసులు పెడితే.. బురద జల్లితే న్యాయపరంగా, రాజ్యంగా పరంగా ప్రతి హక్కును వినియోగించుకుంటాను. ఏసీబీ విచారణకు లాయర్‌ను తీసుకెళ్తానంటే నువ్వు భయపడ్డావు. ప్రశ్నలు అడిగేందుకు నీ ప్రభుత్వం వెనక్కి పోయింది. ఏసీబీ కేసుపై హైకోర్టులో పిటిషన్ వేశాను.. తప్పు ఎఫ్ఐఆర్.. ఇష్టమొచ్చినట్లు సెక్షన్లు పెట్టారని వాదించాం. కానీ హైకోర్టు క్వాష్ పిటిషన్‌ను కొట్టేసింది. దీంతో నాకు ఉరి శిక్ష వేశారు.. నేరారోపణ రుజువైందని అని సంకలు గుద్దుకుంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఇది ప్రారంభమే.. హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో పిటిన్ వేశాం. అది కూడా విచారణకు వస్తది అక్కడ న్యాయ పోరాటం చేస్తాను అని కేటీఆర్ తేల్చిచెప్పారు.
ఇవి కూడా చదవండి..
Sankranthi Holidays | 11 నుంచి 16 వరకు ఇంటర్ కాలేజీలకు సంక్రాంతి సెలవులు
KTR | ఫార్ములా-ఈ కేసులో సుప్రీంకోర్టుకు కేటీఆర్..