Sankranthi Holidays | హైదరాబాద్ : రాష్ట్రంలోని జూనియర్ కాలేజీలకు సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంటర్‌బోర్డు సెలవులిచ్చింది. ఈ నెల 11 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించింది. కాలేజీలు తిరిగి ఈ నెల 18న పునఃప్రారంభమవుతాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి క్రిష్ణ ఆదిత్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లో తరగతులు నిర్వహించొద్దని, నిబంధనలు ఉల్లంఘించిన కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే గుర్తింపును రద్దుచేస్తామని ఆయన హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
KTR | ఫార్ములా-ఈ కేసులో సుప్రీంకోర్టుకు కేటీఆర్..