KTR | ఫార్ములా-ఈ కేసు వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ తనపై పెట్టిన కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన విషయం తెలిసిందే. హైకోర్టు తీర్పును కేటీఆర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో కేటీఆర్ తరఫు న్యాయవాది మోహిత్‌రావు పిటిషన్ వేశారు. ఏసీబీ తనపై తప్పుడు కేసు పెట్టిందని.. దాన్ని క్వాష్ చేయాలంటూ కేటీఆర్ హైకోర్టును కోరగా.. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. క్వాష్ పిటిషన్‌ను కొట్టివేస్తూ మంగళవారం తీర్పును వెల్లడించింది. అరెస్టు చేయకుండా గతంలో ఇచ్చిన మధ్యతంర ఉత్తర్వులను ఉప సంహరించింది. ఈ క్రమంలో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కోర్టు తీర్పుపై ఇప్పటికే లీగల్ టీమ్‌తో చర్చలు జరిపారు. మరో వైపు ఫార్ములా-ఈ కార్ రేసు వ్యవహారంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియెట్ పిటిషన్ దాఖలు చేసింది. ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలని పిటిషన్లో కోరింది.