MLA Jagadish Reddy | రేవంత్ రెడ్డిది రాక్షసానందం.. ప్రజాక్షేత్రంలో సీఎంకు శిక్ష తప్పదు : ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి
MLA Jagadish Reddy | కాంగ్రెస్ సర్కార్ మోసాలపై పోరాడుతూ.. ప్రజలకు అండగా నిలబడుతున్న బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు.
MLA Jagadish Reddy | హైదరాబాద్ : కాంగ్రెస్ సర్కార్ మోసాలపై పోరాడుతూ.. ప్రజలకు అండగా నిలబడుతున్న బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నాడని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడుతూ రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందుతున్నాడని, ఈ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయని ఆయన పేర్కొన్నారు. నందినగర్‌లోని కేటీఆర్ నివాసం వద్ద జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలను పక్కదారి పట్టించడానికి, వీటిపై రైతుల్లో, ప్రజల్లో చర్చకు రానివ్వకుండా.. కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగా పెట్టిన చెత్త కేసు ఫార్ములా ఈ కార్ రేసింగ్ కేసు. కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను ఎండగడుతూ.. రైతాంగాన్ని మేల్కొలోపుతున్న కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాడు. కేటీఆర్‌పై పెట్టిన కేసు విషయంలో చట్టపరంగా మాకున్న అవకాశాలను వినియోగించుకుంటున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసు విషయంలో ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలు నిరాధారం అని జగదీశ్ రెడ్డి స్పష్టం చేశారు.
కేటీఆర్ మీద నమోదు చేసిన కేసు అక్రమం అని ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు తోసిపుచ్చడంతో కాంగ్రెస్ నాయకులు సంతోషపడుతున్నారు. సంతోషపడడమే కాంగ్రెస్ ప్రభుత్వం పని. మేం రైతుబంధు ఇచ్చి సంబురాలు చేసుకున్నాం. మీరు కేసులతో సంబురాలు చేసుకుంటున్నారు. 24 గంటల కరెంట్, కోటిన్నర ఎకరాలకు నీళ్లు ఇచ్చి, మంచినీళ్లు ఇచ్చి అన్ని వర్గాలతో సంబురాలు నిర్వహించాం. వ్యవసాయ రంగంతో పాటు అనేక రంగాలను అగ్రభాగాన నిలిపాం. ఈ రాష్ట్రం తలెత్తుకునే విధంగా కేసీఆర్ నాయకత్వంతో తెలంగాణను తయారు చేశామని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి, ఆయన అనుచరులు మా నేతలు ఎవరైతే దుర్మార్గాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ ప్రజలకు అండగా నిలబడుతున్నారో.. వాళ్లపైన కేసులు పెట్టి సంబురాలు చేసుకుని రాక్షసానందం పొందుతున్నారు. ఈ ఆనందాలు కొన్ని క్షణాలే ఉంటాయి. తప్పకుండా న్యాయమే గెలుస్తుంది.. అందులో సందేహం లేదు. లీగల్‌గా ఉన్న అవకాశాలను వినియోగించుకుంటూనే.. మరోవైపు ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెట్టి.. ప్రజల చేతనే శిక్ష వేయిస్తాం. ఈ కేసులో రేవంత్ రెడ్డినే తప్పకుండా శిక్షకు గురవుతాడు. చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మీరు చేస్తున్న కుట్రలు సాగవు. అంతిమంగా న్యాయమే గెలుస్తది.. ఈ కేసుకు సంబంధించి కేటీఆర్ నిర్దోషిగా, కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు అని జగదీశ్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
BRS | కేటీఆర్‌పై ఈ అక్రమ కేసులు ఎందుకో తెలుసా?
Cold Wave | తెలంగాణలో కొనసాగుతోన్న చలి.. రాబోయే ఐదు రోజులు జర జాగ్రత్త..!
HMPV | హెచ్ఎంపీవీ కలకలం.. ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండిలా..!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

