హైదరాబాద్ : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) 2026 సంవత్సరానికిగానూ 10వ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల టైమ్‌టేబుల్‌ను విడుదల చేసింది. పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులు ఇప్పుడు పూర్తి షెడ్యూల్‌ను చూసుకోవాలని సూచించింది. షెడ్యూల్‌ను పూర్తిగా తేదీల వారీగా పరిశీలించుకోవాలని పేర్కొన్నది.
తాజా టైమ్‌టేబుల్ ప్రకారం.. పదో తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు ఏప్రిల్ 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్టుల్లో జరగనున్నాయి. ఉదయం ఫిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సాగనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 28 నుంచి మే 5వ తేదీ వరకు ఇంటర్నల్స్, ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి.

Open 10th, Inter Time Table