Naxalism: మార్చి 31లోగా దేశంలో నక్సలిజం అంతం: మంత్రి అమిత్ షా
Naxalism: ఈ ఏడాది మార్చి 31 లోగా దేశంలో నక్సలిజాన్ని అంతం చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గౌహతిలో జరిగిన 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో పాల్గొని ఆయన ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఆయన చెప్పారు.
గౌహతి: మార్చి 31 లోగా దేశం నుంచి నక్సలిజాన్ని(Naxalism) నిర్మూలించనున్నట్లు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. 87వ సీఆర్పీఎఫ్ డే పరేడ్‌లో ఆయన పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లో సీఆర్పీఎఫ్ దళాలు కీలక పాత్ర పోషించినట్లు ఆయన చెప్పారు. అక్కడ రాళ్లు రువ్వే ఘటనలు సున్నాకు పడిపోయినట్లు వెల్లడించారు. మణిపూర్‌లోనూ వర్గ హింసను ఆ దళాలు కట్టడి చేసినట్లు చెప్పారు. కేవలం మూడేళ్లలో మావోయిస్టుల వెన్ను విరిచినట్లు సీఆర్పీఎఫ్ను మంత్రి షా కీర్తించారు. సీఆర్పీఎఫ్పై నమ్మకంతో కాన్ఫడెంట్గా చెబుతున్నానని, దేశంలో 2026 మార్చి 31వ తేదీ వరకు నక్సల్ సమస్యను నిర్మూలించనున్నట్లు షా తెలిపారు.
చత్తీస్ఘడ్-తెలంగాణ బోర్డర్లో ఉన్న కర్రెగుట్టలో ఆపరేషన్ బ్లాక్ ఫారెస్ట్‌ను చేపట్టిన దళాలపై మంత్రి షా ప్రశంసలు కురిపించారు. ఆ ఆపరేషన్‌లో గత ఏడాది ఏప్రిల్, మే మధ్య కాలంలో 31 మంది నక్సల్స్ మరణించారు. సుమారు 46 డిగ్రీల ఎండలో ఆ ఆపరేషన్ చేపట్టినట్లు చెప్పారు. నక్సల్స్ ఆధీనంలో ఉన్న ఆ కొండల్ని విముక్తి చేసేందుకు కేంద్ర రిజర్వ్ పోలీసులు దళాలు అత్యంత ధైర్యాన్ని ప్రదర్శించినట్లు తెలిపారు.
పదేళ్ల క్రితం దేశంలో మూడు అతిపెద్ద హాట్‌స్పాట్ కేంద్రాలు ఉండేవని, జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదం, ఈశాన్యంలో చొరబాటులు, చత్తీస్ఘడ్ అడవుల్లో నక్సలిజం పెద్ద సమస్యగా ఉండేవని, కానీ ఇప్పుడు ఆ ప్రాంతాలు ప్రగతి, శాంతికి సంకేతంగా మారాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో 700 మంది సీఆర్పీఎఫ్, నక్సల్ ప్రాంతాల్లో 780 మంది, జమ్మూకశ్మీర్‌లో 540 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లు మంత్రి వెల్లడించారు. వీరి త్యాగాల వల్ల ఒకప్పుడు హింసకు కేంద్ర బిందువులైన ఆ ప్రాంతాలు ఇప్పుడు శాంతియుతంగా మారాయన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Amit Shah
- Eliminated
- India
- Naxalism
RELATED ARTICLES
తాజా వార్తలు
‘అర్హులైన పట్టభద్రులందరూ ఓటర్లుగా నమోదు కావాలి’
NTR | ఎన్టీఆర్ అభిమానుల తీరుపై సజ్జనార్ అసంతృప్తి.. నా ఫొటోను మార్ఫింగ్ చేశారు అంటూ ట్వీట్!
Heart Attack | మహిళల్లో పెరుగుతున్న గుండె పోటు ముప్పు.. ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త..
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

