Harish Rao | జర్నలిస్టును అరెస్టు చేయడం.. మీడియా హక్కును కాలరాయడమే : హరీశ్‌రావు
Harish Rao | ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు.
Harish Rao | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ప్రకటించారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా? అని నిలదీశారు.
జర్నలిస్టులను అరెస్టు చేయడం, బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించడం మీడియా హక్కును, స్వేచ్ఛను కాలరాయడమే అని ఆయన పేర్కొన్నారు. జర్నలిస్టుల పట్ల అనుసరిస్తున్న నిరంకుశ వైఖరిని మార్చుకోవాలని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదుపులోకి తీసుకున్న జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అని హరీశ్‌రావు పేర్కొన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. జీ న్యూస్ రిపోర్టర్ చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారు. నేను జర్నలిస్టును.. మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోకుండా, బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు.
ఉస్మానియా యూనివర్సిటీ సాక్షిగా జర్నలిస్టుల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను.
డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగులు డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజేస్తుంటే, విధి నిర్వహణలో భాగంగా ఆ వార్తలు కవర్ చేయడమే వారు చేసిన తప్పా?
జర్నలిస్టులను అరెస్టు… pic.twitter.com/urarBfBlEN
— Harish Rao Thanneeru (@BRSHarish) July 10, 2024
Media | ఓయూలో మీడియాపై పోలీసుల దాడి.. తీవ్రంగా ఖండించిన టీజేఎఫ్
BRSV | పోలీసులా.. రౌడీలా..! ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులపై దాడి.. వీడియో
DSC | మీ కాళ్లు మొక్కుతా.. డీఎస్సీ వాయిదా వేయండి.. ఓ మహిళా అభ్యర్థి ఆవేదన ఇదీ.. వీడియో
KTR | ఓయూలో జర్నలిస్టు అరెస్టు.. కాంగ్రెస్ సర్కార్‌పై నిప్పులు చెరిగిన కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

