DSC | తెలంగాణ వ్యాప్తంగా డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓ అభ్యర్థి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నాడు. మిగతా అభ్యర్థులు కూడా ఎక్కడికక్కడ నిరసనలు తెలుపుతూ.. డీఎస్సీ మూడు నెలల పాటు వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ డీఎస్సీ అభ్యర్థుల నిరసనలు, ఆందోళనలను కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని తెలంగాణ విద్యాశాఖ స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు కంటతడి పెట్టారు. ఇటీవల నిర్వహించిన టెట్ క్వాలిఫై అయిన వారికి చదువుకోవడానికి సమయం ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. ఒక్క మూడు నెలలు వాయిదా వేస్తే బాగుంటుందని రేవంత్ ప్రభుత్వాన్ని అడుక్కుంటున్నారు.
ఓ మహిళా అభ్యర్థి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి నమస్కారం. డీఎస్సీ సిలబస్ ఎక్కువగా ఉంది. టెట్, డీఎస్సీ మధ్య 20 రోజుల సమయమే ఇచ్చారు. మీ కాళ్లు మొక్కుతా.. దండం పెడుతా.. డీఎస్సీ వాయిదా వేయండి సర్.. నా భర్త నా మీద నమ్మకం పెట్టుకున్నాడు. సమయం లేనందున సిలబస్ పూర్తి చేయడం కష్టం. నాకు బతకాలనిపిస్తలేదు. పోస్టు పోన్ చేయండి సర్ మీ కాళ్లు మొక్కుతా. టీఆర్ఎస్ వాళ్లు ఎవరూ మా వెనుకాల లేరు. సొంతంగానే నిరసనలు తెలుసుతున్నాం అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.
సీఎం రేవంత్ రెడ్డి సార్ మీ కాళ్లు మొక్కుతా డీఎస్సీ వాయిదా వేయండి అంటూ కంటతడి పెట్టుకున్న మహిళా డీఎస్సీ అభ్యర్థి pic.twitter.com/0FTbdruodx
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024