KTR | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద డీఎస్సీ అభ్యర్థుల ఆందోళనలను కవరేజ్ చేసేందుకు వెళ్లిన జీ న్యూస్ రిపోర్టర్ పట్ల పోలీసులు అమర్యాదగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. జీ న్యూస్ రిపోర్టర్ చొక్కా పట్టుకుని పోలీసులు లాక్కెళ్లారు. నేను జర్నలిస్టును.. మీ పని మీరు చేసుకోండి.. మా పని మేం చేసుకుంటాం అంటుంటే కూడా పోలీసులు వినిపించుకోకుండా, బలవంతంగా పోలీసు వాహనంలో ఎక్కించారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ సర్కార్‌పై ఆయన నిప్పులు చెరిగారు.
ఉస్మానియా యూనివర్సిటీలో జీ న్యూస్ రిపోర్టర్, కెమెరామెన్లను అక్రమంగా అరెస్టు చేయడం దారుణం అని కేటీఆర్ మండిపడ్డారు. విధి నిర్వహణలో భాగంగా జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా..? డీఎస్సీ అభ్యర్థుల నిరసన చూపిస్తే పాపమా..? అని కేటీఆర్ ప్రశ్నించారు.
నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద ఓ మహిళా జర్నలిస్టుతో కూడా పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇవాళ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జీ న్యూస్ రిపోర్టర్ గల్లాపట్టి అక్రమ అరెస్టు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో జర్నలిస్టులకు రక్షణ లేదా..? ప్రజాపాలన అంటే జర్నలిస్టులపై జబర్దస్తీ చేయడమా..?ఉస్మానియా యూనివర్సిటీలో ఎందుకింత నిర్బంధం..? అని నిలదీశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి.. ఉస్మానియాలో ఉద్యమం నాటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మళ్లీ పోలీసుల బూట్ల చప్పుళ్లు, ముళ్లకంచెలు అడగడుగునా దర్శనమిస్తున్నాయి. జర్నలిస్టుల పట్ల పోలీసుల వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
ప్రజాస్వామ్యంలో పత్రికాస్వేచ్ఛను హరిస్తే సహించే ప్రసక్తే లేదు. వెంటనే జీన్యూస్ జర్నలిస్టులను బేషరతుగా విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఉస్మానియా యూనివర్సిటీలో..
జీన్యూస్ రిపోర్టర్, కెమెరామెన్ లను
అక్రమంగా అరెస్టు చేయడం దారుణంవిధి నిర్వహణలో భాగంగా…
జర్నలిస్టులు వార్తల కవరేజీకి వెళ్లడం నేరమా ?
డీఎస్సీ సమస్యపై నిరుద్యోగుల నిరసన చూపిస్తే పాపమా ?నిన్న బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వద్ద..
మహిళా జర్నలిస్టులతో దురుసు… https://t.co/F31Rep9liN— KTR (@KTRBRS) July 10, 2024
Media | ఓయూలో మీడియాపై పోలీసుల దాడి.. తీవ్రంగా ఖండించిన టీజేఎఫ్
BRSV | పోలీసులా.. రౌడీలా..! ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులపై దాడి.. వీడియో
DSC | మీ కాళ్లు మొక్కుతా.. డీఎస్సీ వాయిదా వేయండి.. ఓ మహిళా అభ్యర్థి ఆవేదన ఇదీ.. వీడియో