BRSV | పోలీసులా.. రౌడీలా..! ఓయూలో బీఆర్ఎస్వీ నాయకులపై దాడి.. వీడియో
BRSV | ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు.. రౌడీలా మాదిరి ప్రవర్తించారు. డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బీఆర్ఎస్వీ నాయకులను చుట్టుముట్టిన పోలీసులు.. వారిపై దాడి చేశారు.
BRSV | హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో పోలీసులు.. రౌడీలా మాదిరి ప్రవర్తించారు. డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగ అభ్యర్థులకు మద్దతుగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ నాయకుల పట్ల పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. బీఆర్ఎస్వీ నాయకులను చుట్టుముట్టిన పోలీసులు.. వారిపై దాడి చేశారు. అనంతరం పోలీసు వ్యాన్‌లో ఎక్కించారు. అక్కడున్న మరికొంత మంది నాయకులు.. శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న తమపై దాడులు ఏంటని పోలీసులను నిలదీశారు. ఈ క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఇక ఓయూలోని ఎన్ఆర్ఎస్ హాస్టల్ వద్ద బీఆర్ఎస్వీ నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగానికి చెందిన సుమారు 300 మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఓయూలోని పలు హాస్టళ్ల వద్ద పోలీసులు భయానక వాతావరణం సృష్టించారు.
తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని బీఆర్ఎస్వీ నాయకులు జంగయ్య డిమాండ్ చేశారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్-2, 3 లో పోస్టుల సంఖ్య పెంచిన తర్వాతే వాటికి సంబంధించిన రాత పరీక్షలను నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పోలీసులా రౌడీలా!
ఉస్మానియా యూనివర్సిటీలో బూతులు తిడుతూ BRSV నాయకులను కొట్టిన పోలీసులు. pic.twitter.com/AxVi7PmC5L
— Telugu Scribe (@TeluguScribe) July 10, 2024
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Aadarsha Kutumbam | సెన్సార్ పూర్తి చేసుకున్న ‘ఆదర్శ కుటుంబం’.. ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడే!
పోలీస్ అమరుల త్యాగాలను స్మరిస్తూ నల్లగొండలో భారీ బైక్ ర్యాలీ
Naga Chaitanya | నాగచైతన్య కెరీర్లోనే భారీ డీల్.. రూ.45 కోట్లకు ‘వృషకర్మ’ హక్కులు?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

