Harish Rao | హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వంలో కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. రేవంత్ రెడ్డి సర్కార్‌ను ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిపై అక్రమ కేసులు నమోదు చేస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే పాపం.. క్షణాల్లో కేసులు నమోదు చేసి కటకటాలపాలు చేస్తున్నారు. తాజాగా మరో ఇద్దరి విలేకరులపై కాంగ్రెస్ ప్రభుత్వం కేసులు నమోదు చేసింది. ఈ అక్రమ కేసులపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు.
ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ పైసలు జమ చేయడం అన్యాయం అంటూ వార్త రాసిన మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండల విలేకరులు అత్తె సాగర్ (నవ తెలంగాణ), ఓడ్నాల సత్యనారాయణ (నమస్తే తెలంగాణ) లపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం అని హరీశ్‌రావు మండిపడ్డారు.
ప్రశ్నించే గొంతులను నొక్కేయడమేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపితే జర్నలిస్టులపై అక్రమ కేసులు పెడతారా? మీది ప్రజా పాలన కాదు, ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీ పాలనను గుర్తు చేస్తున్నారు. విలేకరులపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని, పత్రికా స్వచ్చకు విలువ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు.
ఇంటి పన్ను కింద వృద్ధుల పింఛన్ పైసలు జమ చేయడం అన్యాయం అంటూ వార్త రాసిన మంచిర్యాల జిల్లా, హాజీపూర్ మండల విలేకరులు అత్తె సాగర్ (నవ తెలంగాణ), ఓడ్నాల సత్యనారాయణ (నమస్తే తెలంగాణ) లపై అక్రమ కేసులు నమోదు చేయడం దుర్మార్గం.
ప్రశ్నించే గొంతులను నొక్కేయడమేనా ప్రజాస్వామ్య పునరుద్ధరణ అంటే.… https://t.co/mhwNuSRqR4 pic.twitter.com/S2NcTP0HSn
— Harish Rao Thanneeru (@BRSHarish) January 25, 2025
ఇవి కూడా చదవండి..
Bandi Sanjay | వాళ్ల పేర్లు పెడితే రేషన్ కార్డులు ఇవ్వం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
Dasoju Sravan | రేవంత్ రెడ్డి కుత్సిత రాజకీయాలపై దాసోజు శ్రవణ్ సంచలన వ్యాఖ్యలు
Chandrababu | దావోస్ పర్యటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను ఉద్దేశించేనా..?