Dasoju Sravan | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి, ఆయన బృందం ఏర్పాటు చేసిన హోర్డింగ్‌పై బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ హోర్డింగ్ కేవలం కుత్సిత రాజకీయాలకు ప్రతీకగా మారడమే కాకుండా కేసీఆర్, కేటీఆర్‌పై నిరాధారమైన నిందారోపణలకూ దారితీస్తోందని అన్నారు.
ఈ చర్యను రేవంత్ రెడ్డి గౌరవహీనత, పనితీరు లోపం, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నంగా శ్రవణ్ అభివర్ణించారు. ఇది తెలంగాణ ప్రజలను తప్పుదారి పట్టించే ఒక చీప్ ప్రొపగాండా. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి తక్కువ స్థాయి రాజకీయాలు చేయడం దురదృష్టకరం అని ఆయన విమర్శించారు. దావోస్ సమ్మిట్ 2025లో రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం తెలంగాణ రాష్ట్ర గౌరవాన్ని క్షీణింపజేసిందని డాక్టర్ శ్రవణ్ దుయ్యబట్టారు. అతని అస్పష్టత, అనుచిత ప్రవర్తన తెలంగాణ ప్రతిష్ఠకు నష్టం కలిగించాయి. అంతర్జాతీయ వేదికపై అతని వేషధారణ, తప్పుడు మాటలతో పెట్టుబడుల హామీలు ఇవ్వడం, రాష్ట్ర ఇమేజ్ను దెబ్బతీశాయి అని డాక్టర్ శ్రవణ్ పేర్కొన్నారు.
ప్రజల దృష్టిని తన వైఫల్యాల నుంచి మళ్లించడానికి రేవంత్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. పని తీరు ద్వారా చూపించాల్సిన చోట, రేవంత్ రెడ్డి ఇలాంటి చీప్ రాజకీయాల్ని అనుసరిస్తున్నారు. ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండదని శ్రవణ్ తెలిపారు. నిజమైన నాయకత్వం అనేది కార్యాచరణతో, దూరదృష్టితో, ప్రజల సమస్యలకు పరిష్కారాలతో చూపించబడుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు సముచితంగా ఉండే విధంగా వాగ్దానాలను నెరవేర్చడంలో ముఖ్యమంత్రి తన దృష్టిని నిలుపుకోవాలి. తెలంగాణ ప్రజలకు నిజాయితీ, గౌరవం, సంక్షేమంపై నిబద్ధత ఉన్న నాయకులు అవసరం అని ఆయన స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి కుత్సిత రాజకీయాలను విడనాడి, రాష్ట్ర అభివృద్ధి కోసం గంభీరమైన ప్రయత్నాలు చేయాలని డాక్టర్ శ్రవణ్ సూచించారు. నాయకత్వం అనేది కార్యాచరణతో ప్రభావం చూపించాలి. కానీ గందరగోళాలను సృష్టించకూడదు అని దాసోజు శ్రవణ్ తెలిపారు.
This billboard is a blatant display of the perverse politics and malicious mindset of @revanth_anumula.
It reflects the depths of his desperation and the lack of dignity to mislead the public. Such cheap tactics are unbecoming of any leader claiming to represent Telangana.… pic.twitter.com/zeRB7v8HKv— Prof Dasoju Sravan Kumar (@sravandasoju) January 25, 2025
ఇవి కూడా చదవండి..
Nagarkurnool | విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్ సస్పెన్షన్
Harish Rao | అన్నదాతల ఆత్మహత్యలకు ఏం సమాధానం చెబుతారు..? రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు