KTR | హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కల్యాణలక్ష్మి పథకం కాంగ్రెస్ ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురవుతోంది. క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి సొమ్మును జమ చేశారు. ఇలా పాత బాకీల కింద బ్యాంకు అధికారులు కల్యాణసొమ్మును జమ చేస్తుండడంతో ఆడబిడ్డల తల్లులు బోరుమంటున్నారు. ఇదేం ప్రభుత్వం అంటూ.. కాంగ్రెస్ పాలనపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్ రెడ్డికి మా ఉసురు తప్పక తగులతదని శాపనార్థాలు పెడుతున్నారు.
క్రాప్ లోన్ కింద కల్యాణలక్ష్మి నగదును జమ చేసుకున్న ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని.. కేసీఆర్ తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని.. వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా? అంటూ రేవంత్ రెడ్డిపై కేటీఆర్ మండిపడ్డారు.
వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి….40 వేలు లబ్ధిదారునికా? అని ప్రశ్నించారు. నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా? అందరికీ రెండు లక్షల పంట రుణ మాఫీ చేశామని బాకాలు కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలి.. సోంబాయి కన్నీటికి కారణం ఎవరు అని! తనకు రావాల్సిన కల్యాణలక్ష్మి డబ్బులులో 60 వేలు ఎందుకు గుంజుకున్నారు అని! తులం బంగారం అన్నారు, ఆఖరికి కల్యాణలక్ష్మి డబ్బులులో కూడా కొర్రీలు పెడుతున్నారు! దందాలు…వసూళ్లు మాత్రమే తెలిసిన రేవంత్‌కి ఒక చిన్న సలహా! కనీసం ఆడపిల్ల పెళ్లి డబ్బుల జోలికి పోవద్దు అనే సోయి కూడా లేదా..? ఇది వినడానికే అసహ్యంగా ఉంది! అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఆడబిడ్డ పెళ్లి చెయ్యడం కష్టం కావొద్దని…
కేసీఆర్ గారు తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి పథకాన్ని…
వడ్డీ వసూలు స్కీంగా మార్చడానికి సిగ్గులేదా?వచ్చిన కల్యాణలక్ష్మి లక్ష రూపాయలలో 60 వేలు బ్యాంకుకి….40 వేలు లబ్ధిదారునికా?
నువ్వు నడిపేది ప్రభుత్వమా? రికవరీ ఏజెన్సీనా?
అందరికీ రెండు… pic.twitter.com/G7ra2f96Lc
— KTR (@KTRBRS) January 25, 2025
ఇవి కూడా చదవండి..
Chandrababu | దావోస్ పర్యటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను ఉద్దేశించేనా..?
KTR | సంఘర్షణ మన రైతులకు కొత్త కాదు.. మోసం కాంగ్రెస్ పార్టీకి కొత్తకాదు : కేటీఆర్
Gallantry Medals | ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్రం అవార్డులు