KTR | హైదరాబాద్ : తెలంగాణలో అన్నదాతల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. కాంగ్రెస్ హామీలను నమ్మి మోసపోయిన రైతులు బలవన్మరణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇవాళ ఉదయం ఆదిలాబాద్ జిల్లాలో మరో రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ స్పందించారు.
సంఘర్షణ మన రైతులకు కొత్త కాదు.. మోసం ఈ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు. దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో దగా పడ్డ వ్యవసాయ రంగాన్ని పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో, కేసీఆర్ సారథ్యంలో రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, సాగునీళ్లు, ఉచితంగా 24 గంటల కరంటు, వంద శాతం పంటల కొనుగోళ్లతో ఆత్మస్థైర్యం నింపి అన్నదాతకు వెన్నెముకగా నిలిస్తే ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ తిరోగమనం మొదలయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
అన్నదాతలారా ఆత్మహత్యలు సమస్యకు పరిష్కారం కాదు. నాగలి ఎప్పుడూ ఒంటరి కాదు.. నాగలి ఈ దేశపు భవిష్యత్తు అని కేటీఆర్ తెలిపారు. జోడెద్దుల మాదిరిగా బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది అని స్పష్టం చేశారు. ఆదిలాబాద్ జిల్లా హత్నూర్, వర్తమన్నూర్ గ్రామ రైతు నర్సయ్య రుణమాఫీ కాలేదని ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం అని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Minister Seethakka | డీజే టిల్లు పాటకు స్టెప్పులేసిన మంత్రి సీతక్క.. Video
Telangana High Court | బెనిఫిట్ షోలు రద్దు.. మరోసారి క్లారిటీ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు