Minister Seethakka | నిత్యం ప్రభుత్వ కార్యక్రమాలతో బిజీగా ఉండే మంత్రి సీతక్క.. విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు. విద్యార్థులతో కలిసి డీజే టిల్లు పాటకు మంత్రి సీతక్క స్టెప్పులేసి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ములుగులో రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మంత్రి సీతక్క పాల్గొన్నారు. యువతీయువకులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించడానికి 3K రన్ నిర్వహించారు. ఈ 3K రన్ ప్రారంభానికి ముందు సీతక్క డీజే టిల్లు పాటకు డ్యాన్స్ చేశారు. అక్కడున్న యువతీ యువకుల్లో ఆమె జోష్ నింపారు. సీతక్క డ్యాన్స్‌కు ఫిదా అయిన యువకులు ఈలలు, చప్పట్లతో అభినందించారు.
ఇదిలా ఉంటే.. ప్రభుత్వ పథకాల అమలులో అధికారులు ఉద్దేశపూర్వకంగా తప్పుచేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సస్పెన్షన్‌తోపాటు సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తామని హెచ్చరించారు. కొందరు అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తున్నారని, స్కీముల అమలులో విచక్షణ, మానవత్వం మరవొద్దని చెప్పారు. మంచిర్యాలలో ఓ వృద్ధురాలికి పింఛన్ ఆపడంపై ఫైర్ అయ్యారు. ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద రుద్దితే కఠినంగా శిక్షిస్తామన్నారు.
ములుగు 3K రన్లో డీజే టిల్లు పాటకు డాన్స్ చేసిన మంత్రి సీతక్క pic.twitter.com/N7V3391zdJ
— Telugu Scribe (@TeluguScribe) January 25, 2025
ఇవి కూడా చదవండి..
Errabelli Dayakar Rao | అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్: మాజీ మంత్రి ఎర్రబెల్లి
Madha Gaja Raja | 12 ఏండ్లకి థియేటర్లో.. విశాల్ ‘మదగజరాజ’ ట్రైలర్ రిలీజ్