Madha Gaja Raja Telugu Trailer | తమిళ కథానాయకుడు విశాల్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మదగజరాజ’. ఖుష్బూ భర్త, దర్శకుడు సుందర్ సీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 2012లో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం 12 ఏండ్ల తర్వాత రీసెంట్గా తమిళంలో విడుదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళంలో హౌజ్‌ఫుల్ కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది ఈ చిత్రం. ఈ నేపథ్యంలోనే తెలుగులో విడుదల చేస్తున్నారు మేకర్స్. జనవరి 31న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. విశాల్‌తో పాటు సంతానం పండించిన కామెడీతో ఉన్న ఈ ట్రైలర్‌ను ప్రస్తుతం ఆకట్టుకుంటుంది.