Errabelli Dayakar Rao | అబద్ధపు మాటలతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం రేవంత్: మాజీ మంత్రి ఎర్రబెల్లి
స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి కూడా న్యాయం జరుగలేదని విమర్శించారు.
వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నందు వల్లే కాంగ్రెస్ పార్టీ ప్రజలను మోస్తున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) అన్నారు. ప్రజా దర్బార్, గ్రామసభలు, ఇంటింటికీ తిరిగి మూడు విడుతలుగా ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకున్నారని, కానీ ఇప్పటివరకు ఒక్క లబ్ధిదారునికి కూడా న్యాయం జరుగలేదని విమర్శించారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ప్రజలు ఆశలో ఉన్నారని చెప్పారు. వరంగల్‌లో పార్టీ నాయకులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఏడాది కాలం పాటు రైతు భరోసా ఇవ్వలేదన్నారు. గ్రామాల్లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. రుణమాఫీ విషయంలో ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదని మండిపడ్డారు.
గ్రామ సభలన్నీ అట్టర్ ఫ్లాప్ అయ్యాయని, ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని విమర్శించారు. మంత్రులు, ముఖ్యమంత్రి ఇతర రాష్ట్రాలకు పోయి నీతులు చెబుతున్నారని ఎద్దేవాచేశారు. దావోస్ పెట్టుబడులు శుద్ధ అబద్ధమని, రేవంత్ రెడ్డి మాటలన్నీ బోగస్ అని చెప్పారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను అబద్ధపు మాటలతో మోసం చేస్తున్నాడని ధ్వజమెత్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో జిమ్మిక్కులు చేయాలని చూస్తున్నాడని మండిపడ్డారు. పోలీసులు, అధికారులను కార్యకర్తలుగా వాడుకుంటున్నారని చెప్పారు. ఇకనైనా హామీలన్నీ అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డికి సూచించారు.
కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారు..
కరీంనగర్ కలెక్టర్‌పై మంత్రి పొంగులేటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. చిల్లర మాటలు మాట్లాడే కాంగ్రెస్ నేతలకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లోనే ప్రజల తిరుగుబాటు ఎలా ఉంటుందో కాంగ్రెస్‌కు తెలుస్తుందన్నారు. భూతిక దాడులు చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అబద్ధపు మాటలు, కుట్రలు, కుతంత్రాలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని నన్నపనేని నరేందర్ అన్నారు. కొండా సురేఖకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులకే మళ్లీ కొబ్బరికాయలు కొడుతున్నారని ఎద్దేవా చేశారు. గ్రామసభల్లో లబ్ధిదారులను ఎలా ఎంపిక చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఇస్తామన్న హామీలు ఒక్కటి కూడా నెరవేరడం లేదని చెప్పారు. వరంగల్‌లో ప్రజా పాలన కాదని, ప్రజా కంటక పాలన కొనసాగుతున్నదని విమర్శించారు. పట్టణంలో కనీసం మంచినీటి సరఫరా కూడా సరిగ్గా చేయడం లేదంటూ మండిపడ్డారు.
రైతులను నిలువునా ముంచారు..
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని మాజీ మంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. రైతు ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని చెప్పారు. రుణమాఫీ అంటూ అనేక ఆశలు పెట్టి, రైతులను నిలువునా ముంచారని మండిపడ్డారు. రైతు భరోసా రూ.15 వేలు ఇస్తామని, ఇప్పుడు రూ.12 వేలే ఇస్తుమంటున్నారని విమర్శించారు. ఎగవేతలు, కోతలతో రేవంత్ సర్కారు ముందుకు పోతున్నదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కర్రుకాల్చి వాతపెడతారన్నారు. గ్రామ సభలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులు, అధికారులను ప్రజలు ఎక్కడికక్కడ నిలదీశారన్నారు. గ్రామ సభల్లో ఒక్క లబ్ధిదారుడినైనా ఎంపిక చేశారా అని ప్రశ్నించారు. ఎంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామ సభల్లో పాల్గొన్నారని నిలదీశారు. పోలీసుల పహారాలో గ్రామసభలు నిర్వహిస్తారా అంటూ మండిపడ్డారు.
Live: BRS Leaders Press Meet in Warangal. https://t.co/omg8ML7U08
— BRS Party (@BRSparty) January 25, 2025
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

