Telangana High Court | తెలంగాణలో సినిమా బెనిఫిట్ షోల(Benefit Shows)కు సంబంధించి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది తెలంగాణ హైకోర్టు. భవిష్యత్‌లో బెనిఫిట్ షోలకు అనుమతి లేదంటూ వెల్లడించింది. సినిమా టికెట్ ధరల పెంపు(Ticket Rate Hikes), స్పెషల్ షోల(Telangana Special Shows)కు సంబంధించిన పిటిషన్‌కి సంబంధించి శుక్రవారం హైకోర్టులో విచారణ జరుగగా.. ప్రభుత్వం తరపున న్యాయవాది తన వాదనాలు వినిపిస్తూ.. సంక్రాంతి సమయంలో సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి ఇచ్చిన అనుమతులను ప్రభుత్వం రద్దు చేసినట్లు న్యాయస్థానానికి వివరించారు.
ఇక ప్రభుత్వం తరపు వాదానలు విన్న ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. బెనిఫిట్ షోలకి అనుమతి లేదంటూ తెలిపింది. సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం.. అర్థరాత్రి 1.30 గంటల నుంచి ఉదయం 8.40 వరకు గల మధ్య సమయంలో ఎలాంటి ప్రత్యేక షోలకు అనుమతి లేదని.. ఈ చట్టాన్ని పాటించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది. అయితే హైకోర్టు ఇచ్చిన కొత్త ఆదేశాల ప్రకారం.. తెలంగాణలో ఇకముందు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు రద్దయినట్లు తెలుస్తుంది.