Gallantry Medals | ఉత్తమ సేవలు అందించిన పోలీసు అధికారులకు కేంద్రం పతకాలు ప్రకటించింది. రిపబ్లిక్ డే సందర్భంగా పతకాలు కేంద్ర ప్రభుత్వం అవార్డులు అందించనున్నది. హైదరాబాద్ లా అండ్ ఆర్డర్ అదనపు సీవీ విక్రమ్‌సింగ్, ఎస్పీ మాణిక్యరాజ్‌కు ప్రెసిడెంట్ మెడల్స్‌ను కేంద్రం ప్రకటించింది. మరో 12 మందికి విశిష్ట సేవా పతకాలు ప్రకటించింది. ఐజీ కార్తికేయ, ఎస్పీలు ముత్యంరెడ్డి, రామ్‌కుమార్, ఫజ్లుర్, డీఎస్పీలు వెంకటరమణ, వేణుగోపాల్, ఏఎస్ఐలు రణ్‌వీర్‌సింగ్, ఠాకూర్, జోసెఫ్, మొయినుల్లాఖాన్, సీఐ నిరంజన్‌రెడ్డి, కానిస్టేబుల్ పాత్యనాయక్, ఆయూబ్‌కు విశిష్ట సేవా పతకాలకు ఎంపిక చేసింది. ముగ్గురు అగ్నిమాపక అధికారులు, నలుగురు హోంగార్డులకు సైతం పతకాలకు ఎంపికయ్యారు.