Nagarkurnool | నాగర్‌కర్నూల్ : విద్యార్థినులను చెప్పుతో కొట్టిన టీచర్‌పై వేటు పడింది. కొండనాగుల జడ్పీ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ క్రమంలో శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ నాగర్‌కర్నూల్ జిల్లా డీఈవో రమేశ్ ఉత్తర్వులు జారీ చేశారు.
అచ్చంపేట నియోజకవర్గం పరిధిలోని బల్మూర్ మండలం కొండనాగులపల్లి జడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు శనివారం ఉదయం స్కూల్ ప్రాంగణంలో ఆడుకుంటూ సరదాగా నవ్వారు. అటుగా వెళ్తున్న ఉపాధ్యాయుడు శ్రీనివాస్ రెడ్డి.. ఆ ముగ్గురు అమ్మాయిలు తనను చూసి నవ్వారని భావించి, వారి పట్ల దురుసుగా ప్రవర్తించాడు. తన చెప్పు తీసుకొని.. ఆ ముగ్గురు విద్యార్థినుల పైకి విసిరికొట్టాడు. దీంతో విద్యార్థినుల మెడకు, చెవులకు తీవ్ర గాయాలయ్యాయి.
బాధిత విద్యార్థినులు జరిగిన విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పుకున్నారు. ఇక తల్లిదండ్రులు తరలివచ్చి.. స్కూల్ ఆవరణలోనే శ్రీనివాస్ రెడ్డికి దేహశుద్ధి చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ తల్లిదండ్రులు, స్థానికులు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఎంఈవోకు ఫిర్యాదు చేశారు. సాయంత్రానికల్లా శ్రీనివాస్ రెడ్డిని సస్పెండ్ చేయాలని విద్యాశాఖ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అన్నదాతల ఆత్మహత్యలకు ఏం సమాధానం చెబుతారు..? రేవంత్‌ను నిలదీసిన హరీశ్‌రావు
Chandrababu | దావోస్ పర్యటనపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు.. సీఎం రేవంత్‌ను ఉద్దేశించేనా..?