కరీంనగర్ : సామాజిక మాధ్యమాల్లో(Social media) వ్యక్తిగతంగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌పై(Sunke Ravi Shankar) చేస్తున్న అనుచిత పోస్టులపై ఆదివారం బీఆర్ఎస్ ఎస్సీ సెల్ రామడుగు మండల శాఖ అధ్యక్షుడు శనిగరపు అర్జున్ ఆధ్వర్యంలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ.. కొంత కాలంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లక్ష్యంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, తదితర సామాజిక మాధ్యమాల్లో కించపరిచేలా ట్రోల్ చేస్తూ పోస్టులు పెడుతూ పైచాచిక ఆనందం పొందుతున్నారని మండిపడ్డారు. సంబంధిత వ్యక్తులను గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు లంక మల్లేశం, పూడూరు మల్లేశం, తడగొండ రాజు, జుట్టు అంజయ్య, పురాణం రమేష్, అశోక్, ప్రభాకర్, రాకేశ్, తదితరులు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..