హైదరాబాద్ : యాదగిరిగుట్ట(Yadagirigutta) వెళ్లొస్తుండగా రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డీసీఎం బ్రేకులు ఫెయిల్ అవడంతో డీసీఎం పల్టీ కొట్టింది( DCM overturns). ఈ ఘటన వరంగల్ హైవేపై ఘట్కేసర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..ఉప్పునూతల గ్రామానికి చెందిన 35 మంది భక్తులు యాదగిరిగుట్టకు వెళ్లి వస్తుండగా ప్రమాదం బ్రేకులు ఫెయిల్ కావడంతో డీసీఎం బోల్తాపడింది. ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచరమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను ఘట్కేసర్ ఏరియా హాస్పిటల్కు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇవి కూడా చదవండి..