Suresh Raina | ఇటీవల పేలవమైన ఫామ్‌తో ఇబ్బందులుపడుతున్న టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) త్వరలో జరిగే చాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy) లో భారీగా పరుగులు సాధించి మళ్లీ ఫామ్‌లోకి వస్తాడని మాజీ క్రికెటర్ సురేశ్ రైనా (Suresh Raina) ఆశాభావం వ్యక్తం చేశాడు. 2019 ప్రపంచకప్ తరహాలోనే బ్యాట్‌తో విశ్వరూపం చూపిస్తాడని పేర్కొన్నాడు. రైనా ఓ స్పోర్ట్స్ చానెల్‌తో మాట్లాడుతూ.. దుబాయి (Dubai) పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని సూర్యకుమార్ (Suryakumar Yadav) తీసుకోవాల్సిందని అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్ ట్రోఫీ కోసం 15 మంది సభ్యులతో భారత జట్టును శనివారం బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో సూర్య కుమార్ యాదవ్, ఫాస్ట్ బౌలర్‌కు మహ్మద్ సిరాజ్‌కు చోటు దక్కలేదు.
ఈ క్రమంలో రైనా మాట్లాడుతూ సూర్య కుమార్ 360 డిగ్రీస్ ప్లేయర్ అని.. మ్యాచ్ ఏ దశలోనైనా ఓవర్‌కు తొమ్మిది పరుగులు చేయగలడని చెప్పాడు. బ్యాట్‌తో విభిన్నంగా ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శించగలడని.. సూర్యకుమార్ ఉంటే ఎక్స్ ఫ్యాక్టర్‌గా ఉండేవాడని తెలిపాడు. ఇప్పుడు ఆ బాధ్యత అంతా ఫామ్‌లో లేని టాప్-3 బ్యాట్స్‌మెన్‌పైనే ఉంటుందని చెప్పాడు. ఇక హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్‌ను జట్టులోకి తీసుకోవాలని మాజీ క్రికెటర్ సూచించాడు. జస్ప్రీత్ బుమ్రా ఫిట్‌నెస్‌పై ఇంకా సందేహాస్పదంగా ఉందని.. షమీ తిరిగి వచ్చినా సిరాజ్‌ను ఎంపిక చేస్తే బాగుండేదని చెప్పారు. ఇప్పటికీ సిరాజ్ జట్టులో చోటు సంపాదించగలడని నమ్ముతున్నానని చెప్పాడు.
బుమ్రా ఫిట్ కాకపోతే సిరాజ్ జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలిపాడు. హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్ ఇద్దరూ డెత్ ఓవర్లలో బౌలింగ్ చేయగలరని పేర్కొన్నాడు. బుమ్రా లేకపోతే సిరాజ్ బెస్ట్ చాయిస్‌గా తెలిపాడు. శుభ్‌మన్ గిల్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడంపై రైనా స్పందించాడు. ఈ నిర్ణయాన్ని విజనరీ స్టెప్‌గా అభివర్ణించాడు. భారత క్రికెట్లో సూపర్‌స్టార్ అని.. వన్డేల్లో అద్భుతంగా రాణించాడని ప్రశంసించాడు. యువ ఆటగాడిని ఎలా తీర్చిదిద్దాలో.. గిల్ జట్టుకు ఏం చేయగలడో రోహిత్‌కు తెలుసునని చెప్పాడు. రోహిత్ నేతృత్వంలోని జట్టుకు చాంపియన్స్‌గా నిలిచే సామర్థ్యం ఉందని రైనా తెలిపాడు. దుబాయిలోని పిచ్ కొంచెం నెమ్మదిగా ఉంటుందని.. కానీ, మా జట్టుకు ఏ పరిస్థితిలోనైనా గెలవగల సామర్థ్యం ఉందని స్పష్టం చేశాడు.