Champions Trophy | ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ శనివారం ముంబయిలో 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. అయితే, ఇందులో పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. దాదాపు 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాల్గొన్న జట్టు సభ్యులే ఉన్నారు. కొత్తగా నలుగురి ఆటగాళ్లను తప్పించి.. వారి స్థానంలో మరో నలుగురికి స్థానం కల్పించింది. ఈ నలుగురిలో ఇద్దరు కొత్తగా ఐసీసీ వన్డే టోర్నీలో ఆడనున్నారు.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025కి ఎంపికైన జట్టులో వన్డే ప్రపంచ కప్ జట్టులో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా ఉన్నారు. కొత్తగా వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్ చేరారు. ఈ నలుగురికి ఇదే తొలి చాంపియన్స్ ట్రోఫీ కావడం విశేషం. అయితే, అర్ష్‌దీప్, పంత్ ఇంతకు ముందు ఐసీసీ టోర్నీల్లో ఆడిన అనుభవం ఉంది. కానీ, యశస్వి జైస్వాల్, వాషింగ్టన్ సుందర్‌కు ఇదే మొదటి ఐసీసీ టోర్నీ. 2023 వన్డే ప్రపంచ కప్ జట్టులో, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ స్థానాల్లో ఈ నలుగురికి చోటు దక్కింది. హార్దిక్ గాయం కారణంగా దూరం కాగా.. శార్దుల్ ఠాకూర్‌కు అవకాశం వచ్చింది.
కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వరుసగా మూడో చాంపియన్స్ ట్రోఫీ ఆడుతున్నారు. 2013లో టీమిండియా చాంపియన్స్ ట్రోఫీని నెగ్గింది. ఆ జట్టులోనే ఈ ముగ్గురు సైతం ఉన్నారు. టీమిండియా 2017లోనూ చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్‌కు చేరిన జట్టులోనూ ముగ్గురు ఉన్నారు. తాజాగా ఈ ఏడాది జరుగనున్న ఐసీసీ ఈవెంట్లోనూ ఆడనున్నారు. వీరితో పాటు ప్రస్తుత జట్టులో చాంపియన్స్ ట్రోఫీ ఆడిన అనుభవం ఉన్న ఏకైక ఆటగాడు హార్దిక్ పాండ్యా మాత్రమే. హార్దిక్ 2017 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టులో ఉన్నాడు. మిగతా 11 మంది ఆటగాళ్లు తొలిసారిగా చాంపియన్స్ ట్రోఫీ ఆడబోతున్నారు.
Team India | బుమ్రాకు బెర్తు.. హైదరాబాదీ సిరాజ్‌కు చుక్కెదురు
ఫైనల్లో భారత్ ఖో ఖో ప్రపంచకప్