ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపికపై ఉత్కంఠకు తెరపడింది. ఇటీవలి పేలవ ప్రదర్శనకు చెక్ పెడుతూ అనూహ్య మార్పులకు ఆస్కారం ఉంటుందనుకున్న అభిమానులకు నిరాశే ఎదురైంది. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి పెద్దగా మార్పులేమి లేకుండానే బీసీసీఐ జట్టును ఎంపిక చేసింది. గాయంతో ఇబ్బంది పడుతున్న బుమ్రాకు బెర్తు ఇచ్చిన సెలెక్టర్టు హైదరాబాదీ సిరాజ్‌కు మొండిచేయి చూపారు. రోహిత్‌శర్మకు డిప్యూటీగా గిల్‌కు చాన్స్ దొరకగా, గాయం నుంచి తేరుకున్న షమీ రీఎంట్రీ ఇచ్చాడు. అర్ష్‌దీప్‌సింగ్ వన్డేల్లోకి రాగా, ఆల్రౌండర్లకు పెద్దపీట వేశారు. ప్రక్షాళన అంటూ గప్పాలకు పోయిన బీసీసీఐ అనుభవానికే మొగ్గుచూపింది.
Team India | ముంబై: స్వదేశంలో ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్, పాకిస్థాన్ వేదికగా వచ్చే నెలలో జరిగే ప్రతిష్ఠాత్మక చాంపియన్స్ ట్రోఫీ కోసం బీసీసీఐ శనివారం భారత జట్టును ప్రకటించింది. అనూహ్య మార్పులేమి లేకుండా 16 మందితో కూడిన జట్టును ఎంపిక చేసింది. బీసీసీఐ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగర్కార్, కెప్టెన్ రోహిత్‌శర్మ జట్టు ప్రకటిస్తూ పలు అంశాలపై మాట్లాడారు.
ఇటీవలి ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో గాయపడ్డ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను ఎంపిక చేసిన సెలెక్టర్లు నిలకడగా రాణిస్తున్న హైదరాబాదీ స్పీడ్‌స్టర్ సిరాజ్‌కు మొండిచేయి చూపారు. గాయం నుంచి తేరుకున్న సీనియర్ పేసర్ షమీ..దాదాపు 14 నెలల తర్వాత తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నాడు. చైనామన్ స్పిన్నర్ కుల్దీప్యాదవ్కు చోటు లభించింది.
ఇక టీ20ల్లో మెరుగ్గా రాణిస్తున్న లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్‌సింగ్‌కు సెలెక్టర్లు వన్డేల్లో అవకాశం కల్పించారు. దుబాయ్‌లో పిచ్ పరిస్థితులను అంచనా వేస్తూ సెలెక్టర్లు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. రోహిత్‌శర్మకు డిప్యూటీగా శుభమన్ గిల్‌కు వైస్‌కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించిన సెలెక్టర్లు ఆల్రౌండర్లకు పెద్దపీట వేశారు. హార్దిక్‌పాండ్యాకు తోడు అక్షర్‌పటేల్, వాషింగ్టన్ సుందర్, జడేజాకు అవకాశం కల్పించారు. ఫస్ట్ చాయిస్ వికెట్‌కీపర్‌గా రిషబ్ పంత్ చోటు దక్కించుకోగా, రిజర్వ్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నాడు. యువ పేసర్ హర్షిత్రానాను కేవలం ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేశారు.
ఫిట్నెస్ ఉంటేనే: బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో గాయపడ్డ బుమ్రా ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ(ఎన్సీఏ)లో పునరావాసం పొందుతున్నాడు. వచ్చే నెల 19వ తేదీ నాటికి మ్యాచ్ ఫిట్నెస్ సాధిస్తేనే బుమ్రాకు జట్టులో చోటు ఉంటుందని సెలెక్టర్లు స్పష్టం చేశారు. ఒకవేళ అప్పటికి బుమ్రా ఫిట్నెస్ సాధించకపోతే అతని స్థానంలో పేస్ ఆల్‌రౌండర్‌గా నితీశ్‌కుమార్‌రెడ్డి చోటు దక్కించుకునే అవకాశముంది. ఇదిలా ఉంటే బోర్డర్-గవాస్కర్ సిరీస్లోబుమ్రా జతగా అదరగొట్టిన సిరాజ్‌ను సెలెక్టర్లు పక్కకు పెట్టారు.
దీనిపై రోహిత్‌ను ప్రశ్నించగా, జట్టులో సమతూకం కోసం సిరాజ్‌ను దురదృష్టవశాత్తు ఎంపిక చేయలేకపోయామని సమాధానమిచ్చాడు. చాంపియన్స్ ట్రోఫీలో కేవలం ముగ్గురు పేసర్లకు పరిమితమయ్యామని పేర్కొన్నాడు. సిరాజ్ లేకపోవడం లోటైనా మాకు ఆప్షన్స్ లేవని అన్నాడు. ఇక ఫార్మాట్‌తో సంబంధం లేకుండా రాణిస్తున్న జైస్వాల్‌ను వన్డేల్లోకి తీసుకున్నామని వివరించాడు. ఇదిలా ఉంటే విజయ్ హజారేలో పరుగుల వరద పారించిన కరణ్ నాయర్‌ను సెలెక్టర్లు కనీసం పరిగణనలోకి తీసుకోలేకపోయారు.
రోహిత్(కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, శ్రేయాస్, రాహుల్, హార్దిక్, అక్షర్, సుందర్, కుల్దీప్, బుమ్రా, షమీ, అర్ష్‌దీప్, జైస్వాల్, పంత్, జడేజా, రానా (ఇంగ్లండ్ సిరీస్‌కు)