జైపూర్: ఇద్దరు టీచర్లు ప్రభుత్వ స్కూల్లో రొమాన్స్‌లో తేలియాడారు. (Teachers Romance) వారిద్దరూ ముద్దులు పెట్టుకుని, కౌగిలించుకుని అసభ్యకరంగా ప్రవర్తించారు. వారి చర్యలకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయడు, ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేశారు. రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అజోలియా ఖేడా గ్రామంలోని సలేరాలో ఉన్న ప్రభుత్వ సీనియర్ సెకండరీ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. సోషల్ సైన్స్ టీచర్ అరవింద్నాథ్ వ్యాస్, ఒక మహిళా ఉపాధ్యాయురాలితో సాన్నిహిత్యాన్ని పెంచుకున్నాడు. దీంతో ఆ ప్రభుత్వ స్కూల్లో వారిద్దరూ పలుమార్లు సరస శృంగారాల్లో మునిగిపోయారు.
కాగా, గత ఏడాది డిసెంబర్లో ఆ ఇద్దరు టీచర్లు కౌగిలించుకుని, ముద్దులు పెట్టుకుని అసభ్యకర చర్యలకు పాల్పడ్డారు. ఈ వీడియో క్లిప్ తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఆ ఉపాధ్యాయుల తీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు స్పందించారు. ప్రభుత్వ స్కూల్లో రొమాన్స్‌లో తేలియాడిన ఆ ఇద్దరు టీచర్లను సస్పెండ్ చేశారు.
The CCTV video of Salera school in Chittorgarh went viral, in which a teacher and a female teacher are doing obscene acts.
The teacher and the female teacher got into a romantic mood in the school itself.
When the District Magistrate came to know about this news, both these… pic.twitter.com/PXv439sY56
— Deepak Kumar (@DeepakK36550352) January 19, 2025