Vinod Kumar | హైదరాబాద్ : నేను పదవుల కోసం ఏనాడూ పాకులాడలేదు.. నా చరిత్ర అందరికీ తెలుసు అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంపై తుపాకీ పెట్టిన రేవంత్ రెడ్డా నా గురించి మాట్లాడేది అని వినోద్ కుమార్ చురకలంటించారు. తెలంగాణ భవన్లో వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
నాకు ఓడిపోతే కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారని రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో ఆరంభం నుంచి నేను ఉన్నాను. నేను తెలంగాణ కోసం ఎంపీగా రాజీనామా చేసి గెలిచాను. ఢిల్లీలో తెలంగాణ కోసం 32 పార్టీలను ఒప్పించేందుకు కేసీఆర్తో కలిసి ప్రయత్నించాను. ప్లానింగ్ బోర్డు చైర్మన్గా నా భాద్యతను తెలంగాణ అభివృద్ధి కోసం నిర్వర్హించాను. నా గురించి సీఎం హేళనగా మాట్లాడారు కనుకే స్పందిస్తున్నానని వినోద్ కుమార్ తెలిపారు.
కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినా మేము ప్రచారం చేసుకోలేదు. మేము ఉద్యోగాలు ఇస్తే నియామక పత్రాలు పోస్టులో వెళ్ళేవి. ఇపుడు ఎల్బీ స్టేడియంలో ఇస్తున్నారు. మేమిచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాక ప్రచారం చేసుకోండి. కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్న రేవంత్ ఇపుడు కొరివి దయ్యం అంటున్నారు. రేవంత్ రెడ్డికి ఎన్ని నాలుకలు ఉన్నాయి..? రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఇచ్చిన నోటిఫికేషన్లు లేనే లేవు అని వినోద్ కుమార్ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
MBBS seats | ఒకే ఇంట్లో నలుగురికి ఎంబీబీఎస్ సీట్లు.. ఫలిస్తున్న కేసీఆర్ కృషి