RS Praveen Kumar | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆదాయాన్ని మరింత పెంచడం కోసం, ఈ రాష్ట్ర బాగోగుల కోసం, ఈ రాష్ట్రంలో ఒక గొప్ప ఇండస్ట్రీని పెట్టడం కోసం వేలాది మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా లక్షలాది, కోట్లాది రూపాయల రెవెన్యూ విచ్చే విధంగా ప్లాన్ చేయడం కోసం మొబిలిటీ వ్యాలీ అనే కార్యక్రమానికి సంకల్పించిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
మరి గత ప్రభుత్వం ఫార్ములా ఈ రేస్ అని ఒక రేస్ కూడా నిర్వహించడం జరిగింది. మరి అదే రేసు ఇంకా నాలుగు సార్లు ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా జరగాల్సి ఉండే. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి అనాలోచిత చర్య వల్ల మొబిలిటీ వ్యాలీ రాకుండా పోయింది. ఒక పన్ను కట్టే సిటిజెన్‌గా రాష్ట్ర ఖజానాకు పన్నులు కడుతున్న నాకు నష్టం జరిగింది, తెలంగాణ ప్రజలకు నష్టం జరిగిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
తెలంగాణలో వేలాది ఉద్యోగాలు వచ్చే అవకాశం కోల్పోయిన మనం ఇందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ప్రశ్నించాలి. వారి పాత్రనే ఎక్కువగా ఉన్నది. ఆనాటి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని గొప్పగా తీర్చిదిద్దాలి, లక్షలాదిమందికి వేలాది మందికి ఉద్యోగాలు ఇవ్వాలన్న సంకల్పంతోని పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి నీరు గారే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరించారు. ఈ సందర్భంగా నేను ఇవాళ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి మీద కూడా కేసు పెట్టాలని మొత్తం రీసెర్చ్ చేసి ఆ సమాచారాన్ని సేకరించి నా ఫిర్యాదులో పొందుపరిచాను అని ఆర్ఎస్పీ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | వరి పంటలో తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ చేసిండ్రు కేసీఆర్ : కేటీఆర్
KTR | ప్రపంచంలో ప్రజాశక్తి కంటే గొప్పదేదీ లేదని రుజువు చేసిన గడ్డ నల్లగొండ : కేటీఆర్
KTR | రైతు ధర్నాకు వచ్చినట్లు లేదు.. విజయోత్సవ ఊరేగింపులా ఉంది : కేటీఆర్