RS Praveen Kumar | హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖండించారు. కొండా సురేఖ మంత్రి పదవికి అనర్హురాలు అని పేర్కొన్నారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
కొండా సురేఖకు మంత్రివర్గంలో ఉండే అర్హత లేదు. కొండా సురేఖ వ్యాఖ్యలపై లీగల్‌గా ముందుకు వెళ్తాము. ఆమె తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోని కేటీఆర్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కొండా సురేఖ వ్యాఖ్యలు కాంగ్రెస్ నీచ సంస్కృతికి నిదర్శనం అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.
రేవంత్ పాలనలో అరాచకాలు, అశాంతి, అభద్రతా భావం పెచ్చురిల్లుతున్నాయని ఆర్ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న హైదరాబాద్ నగరం నడిబొడ్డున పట్ట పగలే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాన్వాయ్ మీద కాంగ్రెస్ గూండాలు దాడికి పాల్పడ్డారు. దాడి జరిగి 26 గంటలు అయినా నిందితులను పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు? అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు.
తెలంగాణ భవన్ వద్దకు కాంగ్రెస్ నేతలు వచ్చి దిష్టిబొమ్మను దగ్ధం చేసే ప్రయత్నం చేశారు. అలా చేయడం తప్పని అడ్డుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలపైన కేసులు పెట్టారు. మరి మా పార్టీ ఆఫీసుపై దాడి చేసేందుకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలపై పోలీసులు ఎందుకు కేసు నమోదు చేయలేదు అని ఆర్ఎస్పీ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా ఎప్పుడూ బీఆర్ఎస్ నేతలు ఇతర పార్టీ కార్యాలయాల్లోకి వెళ్ళలేదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు.
ఇవి కూడా చదవండి..
Ghanta Chakrapani | ఆ సంగతి మీకెవరు చెప్పారు సురేఖ గారూ..? సూటిగా ప్రశ్నించిన ఘంటా చక్రపాణి
Harish Rao | కొండా సురేఖ బేషరతుగా క్షమాపణ చెప్పాలి.. హరీశ్‌రావు డిమాండ్
Nagarjuna | కొండా సురేఖ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా : హీరో నాగార్జున