RS Praveen Kumar | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాలు అధఃపాతాళానికి వెళ్తున్నాయని బీఆర్ఎస్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు. సీఎం నిర్లక్ష్యం వల్ల అనేకమంది పేద పిల్లలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
విద్యార్థులు వాళ్ళ టాయిలెట్స్ వాళ్ళు కడుక్కుంటే తప్పు ఏంటని ఒక ఐఏఎస్ అధికారి అంటున్నారు. మరి రేవంత్ రెడ్డి ఇంట్లో టాయిలెట్ రేవంత్ రెడ్డినే కడుగుతున్నారా? మీ మంత్రుల ఇళ్ళల్లో వాళ్ళ టాయిలెట్స్ మంత్రులే కడుగుతున్నారా? మీ పిల్లల స్కూల్లో టాయిలెట్స్ మీ పిల్లలే కడుగుతున్నారా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిలదీశారు.
ఎస్సీ వర్గాల పట్ల ఐఏఎస్ అలుగు వర్షిణి వివక్ష చూపుతున్నారు. పేద పిల్లలు టాయిలెట్స్ వాళ్లే కడుక్కోవాలని ఐఏఎస్ అధికారితో ఎట్లా చెప్పిస్తారు? గురుకులాల్లో చదువుకునే పిల్లలు సంపన్న వర్గాల నుంచి రాలేదని అలుగు వర్షిణి అంటున్నారు. సంపన్న వర్గాల పిల్లలకు ఒక రూల్, పేద పిల్లలకు ఒక రూల్ ఉందా రేవంత్ రాజ్యాంగంలో. మరి మేము మీ ప్రభుత్వానికి పన్నులు ఎందుకు కట్టాలి? ఇదేనా మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకుని చెప్తున్న రాజ్యాంగం? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.
Read More>>