Surveen Chawla | ‘సాక్రేడ్ గేమ్స్’, ‘డి కపుల్’, ‘రానా నాయుడు’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా(Surveen Chawla) తాజాగా తన క్యాస్టింగ్ కౌచ్ అనుభవం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఒక తమిళ దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగి లైంగికంగా వేధించాడంటూ సుర్వీన్ చావ్లా ఆరోపించింది.
రానా నాయుడు సీజన్ 2 రాబోతున్న సందర్భంగా ప్రమోషన్లో భాగంగా.. రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో పాల్గోంది సుర్వీన్. అయితే ఇందులో ప్రశ్నలు అడిగే వ్యక్తి కాస్టింగ్ కౌచ్ అనుభవాలు గురించి అడుగగా.. సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ.. నేను ఒక తమిళ సినిమా ఆడిషన్ కోసం చెన్నై వెళ్ళాను. ఆ సినిమా దర్శకుడు ఒక నేషనల్ అవార్డు గ్రహీత. అయితే అతడు డైరెక్ట్‌గా అడగకుండా మధ్యవర్తి ద్వారా ‘మీరు ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారు?’ అని అడిగాడు. ఆ సమయంలో నాకు షాక్ తగిలింది. నేను అలాంటి దానికి సిద్ధంగా లేను అని చెప్పానని వెల్లడించింది. అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం సుర్విన్ వెల్లడించలేదు.
ఇదేకాకుండా ముంబైలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని సుర్వీన్ గుర్తు చేసుకుంది. ఒక హిందీ సినిమా చేస్తున్న సమయంలో డైరెక్టర్‌తో మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ ముగిసిన తర్వాత, ఆ డైరెక్టర్ నన్ను గేటు వద్దకు దిగబెట్టడానికి వచ్చాడు. అప్పటికే నాకు పెళ్లయింది. మీటింగ్‌లో నా వైవాహిక జీవితం గురించి, నా భర్త గురించి కూడా అతను అడిగాడు. అప్పుడు మేమిద్దరమే ఆఫీసు క్యాబిన్లో ఉన్నాం. నేను ‘బై’ చెప్పి వెళ్లే సమయంలో, అతను నా వైపు వంగి ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. నేను షాక్‌కు గురై, అతనిని వెనక్కి నెట్టి ఏం చేస్తున్నారని ప్రశ్నించి అక్కడి నుంచి వచ్చేశాను. అయినప్పటికీ అతను గేటు వరకు వచ్చాడు అని సుర్వీన్ ఆ సంఘటనను వివరించింది. ఈ సంఘటన తనను ఎంతగానో బాధించిందని, అయితే తాను ఎప్పుడూ లొంగిపోలేదని సుర్వీన్ చావ్లా స్పష్టం చేసింది.
మరోవైపు క్యాస్టింగ్ కౌచ్‌తో పాటు, బాడీ షేమింగ్ గురించి కూడా సుర్వీన్ మాట్లాడింది. సినీ పరిశ్రమలో మహిళల బరువు, నడుము సైజు, ఛాతీ సైజు వంటి వాటిని కూడా ఎక్కువగా ప్రశ్నిస్తారని, మహిళలను అభద్రతాభావానికి గురిచేయడమే వారి పని అన్నట్లుగా ప్రవర్తిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. సుర్వీన్ చావ్లా చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరోసారి సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ మరియు లైంగిక వేధింపుల ఉనికిని తీవ్ర చర్చకు తెచ్చాయి.
#SurveenChawla, actress from #Rana Naidu, shared her casting couch experience involving a Tamil director who asked for her “commitment.”
She revealed that both the director and the actors involved were National Award winners. pic.twitter.com/vQbbD3nfVK
— Movies4u Official (@Movies4u_Officl) May 31, 2025