RS Praveen Kumar | జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డి.. నిప్పులు చెరిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
RS Praveen Kumar | ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా కూడా జై తెలంగాణ అని నినదించలేదు.
RS Praveen Kumar | హైదరాబాద్ : ఇవాళ సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ నేపథ్యంలో శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో ఎక్కడా కూడా జై తెలంగాణ అని నినదించలేదు. జై తెలంగాణ అనని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.
ఈ రోజు ప్రతిపక్షాలను బంధించి, వారి గొంతు నొక్కి అసెంబ్లీలో ఏకపక్షంగా చరిత్రలో డిసెంబర్ తొమ్మిదో తారీఖు ప్రశస్తిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన ప్రసంగంలో కేసీఆర్ వీరోచిత పోరాట ప్రస్తావనే లేకపోవడం, సంకుచిత మనస్తత్వానికి అద్దం పడుతున్నది. మీరు ఈరోజు ఆంధ్ర పాలకుల స్క్రిప్ట్‌ను తప్పుల్లేకుండా చదివిండని ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.
సూటిగా చెప్పండి.. నవంబర్ 29న కేసీఆర్ ప్రాణ త్యాగానికి సిద్ధం కాకపోతే డిసెంబర్ 9న నాటి కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేస్తుండెనా? మీ ప్రసంగంలో ఈ రోజైనా చివర్లో ‘జై తెలంగాణ’ అనే ధైర్యం, ధమ్ము లేని మీరు ఈ రోజు సాయంత్రం మళ్లీ అందరినీ తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు రండి అంటున్నరు! ఏ ముఖం పెట్టుకోని రావాలె తెలంగాణ ప్రజలు? మీకు అదానీ-ఆమ్దానీలే ముఖ్యం. తెలంగాణ సంస్కృతి ముఖ్యం కాదు అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజమెత్తారు.
ఇవి కూడా చదవండి..
Harish Rao | అదానీ దొంగ అని రాహుల్ అంటే.. రేవంతేమో అలాయ్ బలాయ్ చేసుకుంటడు : హరీశ్‌రావు
BRS | నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసిన పోలీసులు
KTR | అదానీ.. రేవంత్ దోస్తానాను శాసనసభ వేదికగా ఎండగడతాం: కేటీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

